Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ వారం ట్రేడ్ టాక్: థియేట్రికల్ రిలీజ్

ఈ వారం ట్రేడ్ టాక్: థియేట్రికల్ రిలీజ్

సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే సూచనలు కనిపించకపోయినా కానీ పలువురు నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్‌కే కట్టుబడి పూర్తయిన సినిమాలను అలాగే పెట్టుకున్నారు.

నిశ్శబ్ధం, ఉప్పెన లాంటి చిత్రాలకు ఓటీటీ ఆఫర్లు బాగానే వచ్చినా కానీ అది థియేట్రికల్ రెవెన్యూకి సాటి రాదని అనిపించడంతో నిర్మాతలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. జులై లేదా ఆగస్ట్ నుంచి అంతా మామూలైపోతుందనే ఆశాభావంతో వున్నారు. 

తెలుగు సినిమా బడ్జెట్లు మిగతా ప్రాంతీయ భాషా చిత్రాల కంటే ఎక్కువ కావడం వల్ల ఓటీటీ వేదిక అన్నిటికీ వర్కవుట్ కావడం లేదు.

ఉదాహరణకు ఉప్పెన లాంటి సినిమాను మలయాళం లేదా తమిళంలో అయితే అయిదారు కోట్ల బడ్జెట్‌లో తీసేస్తారు. కానీ ఈ చిత్రానికి దాదాపు పాతిక కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఓటీటీ వాళ్లు ఎంత ఆఫర్ చేసినా కానీ ఈ చిత్రానికి మహా అయితే పది కోట్లు ఇవ్వగలరు.

మిగతా సినిమాలకు కూడా బడ్జెట్ ఎక్కువ కావడమే ప్రధాన సమస్యగా మారింది. ఇకమీదట ఓటీటీని దృష్టిలో వుంచుకుని తక్కువ బడ్జెట్ చిత్రాలను తీయవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం తెలుగు సినిమా పరిశ్రమకు థియేటర్ రెవెన్యూ కీలకం.

ఓవర్సీస్ మాట ఎలా వున్నా కనీసం తెలుగు రాష్ట్రాల వరకు సినిమా బిజినెస్ మరో రెండు నెలల్లో సాధారణ స్థితికి వస్తుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?