cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

ఈ వారం ట్రేడ్‌ టాక్‌

2.0 చిత్రాన్ని 'బాహుబలి'తో సమానంగా అంచనా వేసారు కానీ రాంగ్‌ టైమ్‌లో రిలీజ్‌ అవడం, అదీ కాక 2డి వెర్షన్‌కి ఆదరణ లేకపోవడంతో అంచనాలకి తగ్గ వసూళ్లు రావడం లేదు. తొలి వారంలో నైజాంలో బాగా ఆడిన ఈ చిత్రం ఆంధ్ర, సీడెడ్‌ ప్రాంతాల్లో అమ్మిన రేట్లకి తగ్గ రేంజిలో వసూళ్లు రాబట్టలేదు. తొలి వారంలో నలభై కోట్ల షేర్‌ని తెలుగు రాష్ట్రాల నుంచి రాబట్టుకున్న ఈ చిత్రం సేఫ్‌ కావడానికి ఇంకా చాలా డిస్టెన్స్‌ ట్రావెల్‌ చేయాల్సి వుంది.

రెండవ వారంలో ఈ చిత్రం ఎంతవరకు నిలదొక్కుకుంటుందో, ఏమాత్రం రాణిస్తుందోనని బయ్యర్లు కలవర పడుతున్నారు. సెకండ్‌ వీకెండ్‌ కీలకమైన 2.0కి పోటీగా చాలా కొత్త సినిమాలు వచ్చాయి. కవచం, సుబ్రమణ్యపురం, నెక్స్‌ట్‌ ఏంటి తదితర చిత్రాల వల్ల ఈ చిత్రం వసూళ్లకి బ్రేక్స్‌ పడే అవకాశాలున్నాయి. సెకండ్‌ వీక్‌ పర్‌ఫార్మెన్స్‌తో 2.0 ఫైనల్‌ రేంజ్‌ పట్ల ఒక అవగాహన వస్తుంది.

టాక్సీవాలా నిర్మాతలకి లాభాల పంట పండించింది. విజయ్‌ సూపర్‌హిట్‌ చిత్రాల స్థాయిలో ఆడకపోయినా తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. నవంబరులో విడుదలైన సినిమాల్లో టాక్సీవాలా, సర్కార్‌ మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. 

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?