cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

సంక్రాంతి తర్వాత ఊహించినట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద స్తబ్ధత నెల‌కొంది. అల‌ వైకుంఠపురములో తర్వాత వచ్చిన సినిమాల్లో ఏదీ సక్సెస్‌ అవలేకపోయింది. డిస్కో రాజా డిజాస్టర్‌ అయితే, అశ్వద్థామ యావరేజ్‌గా ఆడింది కానీ నష్టాలు తప్పించుకోలేకపోయింది. నాగశౌర్య స్వీయ నిర్మాణంలో చేసిన ఈ చిత్రం అతడికి నర్తనశాల‌తో వచ్చిన కష్టాల‌ని మరింత పెంచింది.

ఇక గత వారం విడుదలైన జాను చిత్రానికి సమంత వల్ల‌ కూడా ప్రయోజనం లేకపోయింది. తమిళంలో క్లాసిక్‌ అనిపించుకున్న ఈ చిత్రాన్ని అదే దర్శకుడితో రీమేక్‌ చేసినా కానీ ఫలితం లేకపోయింది. శర్వానంద్‌కి వరుసగా మూడవ పరాజయం దక్కగా, సమంత వున్నంత మాత్రం సక్సెస్‌ అయిపోదనేది తెలిసి వచ్చింది. 

అల‌ వైకుంఠపురములో వీకెండ్స్‌లో ఇంకా షేర్స్‌ రాబట్టుకుంటోంది. వరల్డ్‌ ఫేమస్ ల‌వర్‌తో విజయ్‌ దేవరకొండ సత్తాకి మరో పరీక్ష ఎదురవుతోంది. ఈ చిత్రంపై ముప్పయ్‌ కోట్ల బిజినెస్‌ ఆధారపడివుంది. మరి అతడయినా సంక్రాంతి తర్వాత పడిన మార్కెట్‌ని లేపుతాడేమో చూడాలి. 

 


×