cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎమోషనల్ ఏప్రిల్.. ఇదో కొత్త ట్రెండ్

ఎమోషనల్ ఏప్రిల్.. ఇదో కొత్త ట్రెండ్

కొన్నిసార్లు కొన్ని సినిమాలు అలా సెట్ అవుతుంటాయి. ఈ నెలలో విడుదలైన సినిమాల మధ్య కూడా ఓ చిన్న పోలిక ఉంది. జానర్ ఏదైనా, కథ మారినా, హీరో ఎవరైనా.. ఆ సినిమాలన్నీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. అదే ఏప్రిల్ నెల సినిమాల్లో మేజిక్.

ఏప్రిల్ 5న మజిలీ సినిమా వచ్చింది. నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. చైతూ కెరీర్ లో ఇంత ఎమోషనల్ మూవీ ఇప్పటివరకు రాలేదు. ఆడియన్స్ కూడా ఆ భావోద్వేగాలకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇక ఏప్రిల్ 12 చిత్రలహరి సినిమా వచ్చింది. ఇది కూడా ఎమోషనల్ మూవీనే. సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న హీరో అంతిమంగా తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడనే కథతో ఎమోషనల్ గా తెరకెక్కింది చిత్రలహరి. ఇక ఏప్రిల్ 25న రాబోతున్న సీత సినిమా కూడా మోస్ట్ ఎమోషనల్ మూవీ అని తెలుస్తోంది.

తేజ సినిమాలన్నీ ఎమోషనల్ గా ఉంటాయి. సీత మాత్రం ఈ విషయంలో ఇంకాస్త ఎక్కువే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో కూడా చనిపోతాడనే బజ్ నడుస్తోంది. స్టోరీ సంగతి పక్కనపెడితే.. ఇది కూడా మోస్ట్ ఎమోషనల్ మూవీ అనేది పక్కా. ఇలా ఒకే నెలలో 3 ఎమోషనల్ మూవీస్ అన్నమాట.

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను