cloudfront

Advertisement


Home > Movies - Movie News

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ టాక్ః ఆ డిజాస్టర్లే బెటర్!

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ టాక్ః ఆ డిజాస్టర్లే బెటర్!

ఆమీర్ ఖాన్ ఓవరాక్షన్ చేశాడు.. బహుశా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మీద వస్తున్న తీవ్రమైన కంప్లైంట్! ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా రివ్యూలు చదవడం లాఫ్టర్ థెరపీ అంటున్నారు నెటిజన్లు. సినిమా తీవ్రంగా విసిగించేసిందని.. సినిమా చూసినవాళ్లు థియేటర్లో తాము పడ్డబాధను సరదా సరదా మీమ్స్ తో చెబుతున్నారు. 

మూడు వందలకోట్ల రూపాయల స్థాయి బడ్జెట్ తో రూపొందిన థగ్స్.. కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని బాక్సాఫీస్ పండిట్లు అంచనా వేశారు. కలెక్షన్ల మాటేమిటో కానీ.. తొలిరోజున వస్తున్న డివైడ్ టాక్ ను బట్టి చూస్తే.. ఇది మునిగిన నావ అని స్పష్టం అవుతోంది.

ఈ మధ్యకాలంలో ట్యూబ్ లైట్, రేస్ త్రీల తర్వాత.. తొలి షోతోనే నెటిజన్ల నుంచి ట్రోల్ ఎదుర్కొంటున్న భారీ బాలీవుడ్ సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ అని చెప్పవచ్చు. కొంతమంది నెటిజన్లు అయితే థగ్స్ కన్నా రేస్ త్రీనే కాస్త బెటర్ అని అంటున్నారు.

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ థగ్స్ తీవ్రంగా డిజప్పాయింట్ చేస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమీర్ ఖాన్ నుంచి ఇలాంటి సినిమాను ఎక్స్ పెక్ట్ చేయలేదు అని వాపోతున్నారు. ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చేశాడంటే.. థియేటర్లలో పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చని ట్విటర్లో కామెంట్లు కనిపిస్తున్నాయి.

పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ కు అథమస్థాయి అనుకరణ ఈ సినిమా అని, చాలా వీక్ స్క్రీన్ ప్లే అని రివ్యూయర్లు అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి హృతిక్ రోషన్ నిరాకరించి మంచి పని చేశాడని చెబుతున్నారు. ఆమీర్ ఇలాంటి స్క్రిప్ట్ ను ఎలా ఎంచుకున్నాడో అర్థంకావడం లేదని ఆయన ఫ్యాన్స్ ఒకవైపు వాపోతూనే.. షారూక్, సల్మాన్ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.

అయితే బాలీవుడ్ మీడియా హౌస్ లన్నీ.. ఏకగ్రీవంగా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కు నెగిటివ్ రేటింగ్ లు ట్రోలింగ్ రివ్యూలు ఇచ్చేస్తున్నాయి. ఆమీర్ సినిమా డిజాస్టర్ లలో కూడా అధ్వానమైనదని తేల్చేస్తున్నాయి.

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్