Advertisement


Home > Movies - Movie News
ఇండస్ట్రీకి ఇంకా హిట్ పడలేదు: నాని

ఈ మాట అంటోంది మేం కాదు, స్వయంగా నాని చెబుతున్నాడు. 2018కి ఇంకా బోణీ పడలేదంటున్నాడు నేచురల్ స్టార్. ఆ లోటును తీరిసే సినిమా కోసం వెయిట్ చేస్తున్నానంటున్నాడు. 

ఈ ఏడాది అజ్ఞాతవాసితో మంచి బోణీ పడుతుందని అంతా ఊహించారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. జైసింహా సినిమా కూడా చెప్పుకోదగ్గ హిట్ కాదు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడం మాత్రమే ఈ సినిమాకు కమర్షియల్ గా కలిసొచ్చింది. ఇక రంగులరాట్నం అట్టర్ ఫ్లాప్ అయిన విషయం కూడా తెలిసిందే.

అందుకే ఈ ఏడాది ఇంకా హిట్ పడలేదంటున్నాడు నాని. భాగమతి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన నాని.. ఈ ఏడాది భాగమతి బోణీ కొడుతుందని జోస్యం చెబుతున్నాడు.

ఇంట్లో ఓ సూపర్ స్టార్ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇన్నాళ్లూ తనకు తెలియలేదని, ఇప్పుడు అనుష్క తన ఇంటిలో మనిషిగా మారిపోవడంతో.. తమ ఇంట్లో కూడా ఓ సూపర్ స్టార్ ఉన్న ఫీలింగ్ కలుగుతోందని అంటున్నాడు నాని.