Advertisement

Advertisement


Home > Movies - Movie News

సరిపోద్దా ఆదివారం.. నాని సినిమాకు కీలకం

సరిపోద్దా ఆదివారం.. నాని సినిమాకు కీలకం

సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు నాని. కానీ అంతకంటే ముందు సరిపోద్దా ఆదివారం అంటోంది ట్రేడ్. అవును.. ఈరోజు నాని సినిమా హాయ్ నాన్నకు చాలా కీలకం. ఎంత కీలకం అంటే, ఈ సినిమా బ్రేక్-ఈవెన్ ను, తదనుగుణంగా హిట్ లేదా ఫ్లాట్ ను డిసైడ్ చేసే రోజు ఇది.

హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ బరిలో చాలా స్లోగా మొదలైంది. మొదటి రోజు ఈ సినిమా వసూళ్లు చూసి ట్రేడ్ ముక్కున వేలేసుకుంది. కనీసం 15శాతం కూడా రికవరీ అవ్వలేదు. నాని రీసెంట్ సినిమాల్లో అత్యల్ప ఓపెనింగ్స్ అందుకుంది ఈ సినిమా.

అయితే రెండో రోజు నుంచి సినిమా ఊపందుకుంది. శనివారం కూడా 70శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. మరీ ముఖ్యంగా బి, సి సెంటర్లలో గ్రోత్ కనిపించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆదివారంపై పడింది. ఈరోజు ఈ సినిమాకు వచ్చే వసూళ్లు చాలా కీలకం.

ఈరోజు వచ్చే వసూళ్లపైనే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ ఆధారపడి ఉంది. ఎందుకంటే, రేపట్నుంచి వద్దన్నా ఆక్యుపెన్సీ తగ్గుతుంది. ఆ తర్వాత వచ్చే వీకెండ్ లో మొదటి వారాంతం స్థాయిలో ఆక్యుపెన్సీ ఆశించలేం. కాబట్టి ఈరోజు ఈ సినిమాకు వచ్చే వసూళ్లు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనే విషయాన్ని తేలుస్తాయి.

అటు ఓవర్సీస్ లో మాత్రం నాని సినిమా స్ట్రాంగ్ గా ఉంది. ఓవర్సీస్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు ఈ హీరో. హాయ్ నాన్నతో కలిపి నాని నటించిన 9 సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ అందుకోవడం విశేషం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?