cloudfront

Advertisement


Home > Movies - Movie News

అందర్నీ కదిలించిన 'యాత్ర'.. టాలీవుడ్ ను తప్ప!

అందర్నీ కదిలించిన 'యాత్ర'.. టాలీవుడ్ ను తప్ప!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. క్లైమాక్స్ లో కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు లెక్కలేనన్ని. ఇలా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతున్న యాత్ర సినిమా టాలీవుడ్ "ప్రముఖుల" మనసుల్ని మాత్రం కదిలించలేకపోయింది.

ఎన్టీఆర్-కథానాయకుడు ఇలా రిలీజైన వెంటనే అలా ట్వీట్లు వెళ్లువెత్తాయి. ఆహా.. ఓహో అంటూ ఒకటే పొగడ్తలు.  ఈ క్రమంలో హద్దులుదాటి బాలయ్యను చెట్టు ఎక్కించేసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అదే యాత్ర సినిమాకు వచ్చేసరికి మాత్రం అంత రెస్పాన్స్ కనిపించలేదు.

నిజానికి ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా కంటే కొన్ని రెట్లు బెటర్ మూవీ యాత్ర. పార్టీలకు అతీతంగా, జానర్ కు భిన్నంగా, వయసు తేడాలు లేకుండా యూత్ నుంచి పెద్దోళ్ల వరకు అందర్నీ ఆకర్షిస్తోంది ఈ సినిమా. టాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఇది కచ్చితంగా ఆకర్షించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వాళ్లందరికీ మనసులో భయం.

యాత్ర సినిమాను మెచ్చుకుంటే ఎక్కడ చంద్రబాబుకు కోపం వస్తుందేమోనని చాలామందికి అనుమానం. మహి వి రాఘవ్ డైరక్ట్ చేసిన ఈ హార్ట్ టచింగ్ మూవీని మెచ్చుకుంటే పరిశ్రమలో ఓ వర్గానికి దూరమైపోతామనే భయం. ఎందుకొచ్చిన గొడవ తటస్థంగా ఉంటే పోతుంది కదా అనే నిర్లక్ష్య ధోరణి. ఇవన్నీ కలిసి యాత్ర సినిమాను పరిశ్రమలో అనాధగా మార్చేశాయి.

పరిశ్రమ పట్టించుకోకపోయినా, ప్రజలు పట్టించుకున్నారు. తమ బాధ్యతగా యాత్ర సినిమా చూసొస్తున్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో పెరిగిన ఎంతోమంది ప్రేక్షకులు యాత్ర సినిమాను చూడడం తమ బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. ఫీజు రీఇంబర్స్ మెంట్ తో ఇంజినీరింగ్ చదివి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు.. యాత్ర సినిమా చూసి వైఎస్ఆర్ కు తామిచ్చే నివాళి ఇదే అంటూ పోస్టులు పెడుతున్నారు.

యాత్ర సినిమాకు ఇది చాలు. సోకాల్డ్ టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు. అయితే ఈ చిత్రానికి దూరంగా ఉంటున్న చాలామంది "ప్రముఖులు" తమకున్న సంకుచిత మనస్తత్వాన్ని మాత్రం తమకుతాముగా బయటపెట్టుకున్నట్టయింది.

ఇప్పటికైనా టాలీవుడ్ ముందుకురావాలి. పరిశ్రమకు కులాలు, మతాలు, పార్టీలు, రంగులు లేవని గొప్పలు చెప్పుకునే ప్రముఖులు యాత్ర సినిమాను ఓ విజయంగా గుర్తించకపోయినా ఫర్వాలేదు. కనీసం ఓ మంచి ప్రయత్నంగా మెచ్చుకోవాలి.