టాలీవుడ్ కు జగన్ స్ట్రోక్ @ 100 కోట్లు

ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించిన వ్యవహారం టాలీవుడ్ కు మాస్టర్ స్ట్రోక్ గా తగలబోతోంది. ఆంధ్ర, సీడెడ్ ఏరియాలకు సినిమాల అమ్మకం రేట్లు దాదాపు 20 శాతం కోతకు గురికాబోతున్నాయి. అంటే దగ్గర దగ్గర…

ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించిన వ్యవహారం టాలీవుడ్ కు మాస్టర్ స్ట్రోక్ గా తగలబోతోంది. ఆంధ్ర, సీడెడ్ ఏరియాలకు సినిమాల అమ్మకం రేట్లు దాదాపు 20 శాతం కోతకు గురికాబోతున్నాయి. అంటే దగ్గర దగ్గర 60 కోట్లకు పై మాటే అన్నమాట.

ఇది ఎలా అంటే వివరంగా చూద్దాం. అన్నింటి కన్నా ముందుగా బాలయ్య బాబు అఖండ సినిమా విడుదల కాబోతోంది. దీన్ని ఆంధ్ర 35 కోట్ల మేరకు, సీడెడ్ 12 కోట్లకు పైగా మార్కెట్ చేసారు. 

ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గిపోయాయి. అందువల్ల బయ్యర్లు 30 శాతం తగ్గించాలని కోరారు. ఆఖరికి అది 20 శాతం దగ్గర ఆగింది. ఆ మేరకు తగ్గించకపోతే సినిమా తీసుకునేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు. అంటే దాదాపు తొమ్మిది కోట్ల తగ్గింపు. 

అలా కనుక తగ్గిస్తే ఒక్క అఖండ మీదనే 9 కోట్ల మేరకు డెఫిసిట్ పడుతుంది. ఇక పుష్ప సంగతి చూస్తే ఆంధ్ర 60 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. సీడెడ్ 25 కోట్ల మేరకు వుండే అవకాశం వుంది. అంటే 20 శాతం కట్ చేయాలి అంటే 15 కోట్ల మేరకు కోత పడుతుంది.  

అదే ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఆంధ్ర 100 కోట్ల బిజినెస్. సీడెడ్ 40 కోట్ల బిజినెస్. 20శాతం కోత అంటే 28 కోట్ల మేరకు కట్ చేయాలి. 

ఇక ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలు వుండనే వున్నాయి. అన్నీ లెక్కలు వేసుకుని 20 మేరకు డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తే దాదాపు 70 కోట్లు అన్నమాట. 

జగన్ టాలీవుడ్ కు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఇది. మీడియం, చిన్న సినిమాలు అన్నీ లెక్కవేసుకుంటే 100  కోట్లకు చేరిపోతుంది. అంటే జగన్ కనుక టాలీవుడ్ వత్తికి లొంగి, లేదా మంత్రి పేర్ని నాని సిఫార్సులకు తలవొగ్గి రేట్లు పెంచితే టాలీవుడ్ కు 100 కోట్ల అదనపు ఆదాయం అన్నమాట.