cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్

టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్

కరోనా తరువాత ఇప్పుడిప్పుడే హుషారుగా వున్న టాలీవుడ్ ను మళ్లీ టెన్షన్లు చుట్టుముడుతున్నాయి. మహరాష్ట్రలో మళ్లీ కరోనా పుంజుకోవడం అన్నది ఓ టెన్షన్. గత  ఏడాది కూడా మహరాష్ట్ర తరువాత తెలంగాణకు కరోనా పాకింది.

ఇప్పుడు ఎలా వుంటుందో  పరిస్థితి అని నిర్మాతలు కిందా మీదా అవుతున్నారు. సినిమాలు అన్నీ ముమ్మరంగా షూటింగ్ ల్లో వున్నాయి. వరుసగా డేట్ లు ఇచ్చారు. ఇలాంటి టైమ్ లో షూటింగ్ లు తేడా వచ్చినా, విడుదలలు తేడా వచ్చినా పరిస్థితి దారుణంగా వుంటుంది.

ఇదే సమయంలో మరో టెన్షన్ కూడా వుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ ఏప్రిల్ తో అయిపోతుందనుకున్నారు. కానీ మే వరకు అది వుంటుందని ఇప్పుడు రూఢీ అయింది. ఇలా అయితే అది దసరాకు వస్తుందా? రాదా?అన్నది మరో టెన్షన్.

ఏమాత్రం తేడా జరిగి ఆర్ఆర్ఆర్ కనుక సంక్రాంతికి వెళ్లింది అంటే టాలీవుడ్ సినిమాల షెడ్యూలు అంతా తల్లకిందలైపోతుంది. పెద్ద హీరోల పెద్ద సినిమాలు అన్నీ కిందా మీదా అయిపోతాయి. టాలీవుడ్ సర్కిళ్లలో బలంగా వినిపిస్తున్న డిస్కషన్ పాయింట్లు ఇవే.

టీడీపీ ముచ్చట తీరింది

దేశం మౌనం పాటిస్తోంది

 


×