Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ సమ్మర్ అయిపోయినట్లేనా?

టాలీవుడ్ సమ్మర్ అయిపోయినట్లేనా?

కరోనా పుణ్యమా అని టాలీవుడ్ కు వరుసగా రెండో సమ్మర్ ఎగిరిపోయింది. 2020 సమ్మర్ పూర్తిగా ఎగిరిపోయింది. 2021 సమ్మర్ మీద హోప్ పెట్టుకుంటే అది కూడా పూర్తిగా ఎగిరిపోయేలా కనిపిస్తోంది.  

ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వకీల్ సాబ్ తో క్రేజీ సినిమాల జాతర స్టార్ట్ కావాల్సి వుంది. ఆ లెక్కలోనే వకీల్ సాబ్ హిట్ అయింది. మాంచి ఓపెనింగ్ వచ్చింది అనుకునే లోగా ఆంధ్రలో రేట్ల తంటా వచ్చి పడింది. 

ఆ సంగతి అలా వుంచితే 16న రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడింది. 23న రావాల్సిన నాని 'టక్ జగదీష్' ఆ దారిలోనే వెళ్లింది. ఆ తరువాత వారం రావాల్సిన పాగల్, విరాటపర్వం సినిమాలు కూడా డిటో..డిటో అయ్యాయి. 

ఆ విధంగా ఏప్రిల్ నెల ఎగిరిపోయింది. ఇక మే నెలలో పెద్ద సినిమా అనుకున్న ఆచార్య కూడా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప విడుదల డేట్ అయిన ఆగస్టు 13 కేసి ఆచార్య మేకర్లు చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  

మే నెలలో బాలయ్య అఖండసినిమా రావాల్సి వుంది. కానీ ఈ సినిమాకు ఇంకా వర్క్ వుందని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా ఇలా వుంటే వర్క్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం వుంది. 

ఇప్పటి పరిస్థితుల ప్రకారం మరో నెల వరకు సరైన సినిమా అన్నది లేదు.  ఆ తరువాత అఖండ కూడా రాకపోతే ఇక సమ్మర్ అయిపోతుంది. పోస్ట్ సమ్మర్ మిగులుతుంది. అదేం అవుతుందో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?