cloudfront

Advertisement


Home > Movies - Movie News

టూ లేట్‌ సూర్యా!

టూ లేట్‌ సూర్యా!

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తర్వాతి తరం తమిళ హీరోలలో సూర్యకి తెలుగునాట బలమైన మార్కెట్‌ ఏర్పడింది. గజిని, యముడు లాంటి విజయాలు సూర్యకి తెలుగు రాష్ట్రాల్లోను స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టాయి. సూర్యకి తెలుగు, తమిళంలో వున్న పాపులారిటీ దృష్ట్యా పలువురు తెలుగు దర్శకులు అతనితో స్ట్రెయిట్‌ చిత్రం చేయాలని ప్లాన్‌ చేసారు. త్రివిక్రమ్‌తో అయితే రెండు, మూడుసార్లు ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ కూడా అయింది.

అయితే తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయడానికి గజిని లాంటి అద్భుతమైన సబ్జెక్ట్‌ కావాలంటూ సూర్య తాత్సారం చేసాడు. అదే సమయంలో తమిళంలో కొన్ని చెత్త కథలు ఒప్పుకుని వరుస పరాజయాలు చవిచూసాడు. ప్రతి సినిమాతోను ఫెయిల్‌ అవుతోన్న సూర్యకి ఇటీవలి 'ఎన్‌జికె'తో తీవ్ర పరాభవం మిగిలింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో కనీసం అయిదు కోట్లు కూడా రాబట్టలేకపోయింది.

తెలుగువారికి బాగా తెలిసిన దర్శకుడు, స్టార్‌ హీరోయిన్లు వున్నా కానీ ఎన్‌జికె డిజాస్టర్‌ అవడంతో సూర్య మార్కెట్‌ ఎంతగా పడిపోయిందో స్పష్టమయింది. ఇప్పుడు స్ట్రెయిట్‌ సినిమాలు చేస్తానంటూ తెలుగు దర్శకుల కోసం చూస్తున్నాడు కానీ ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. సూర్య మళ్లీ అనువాద చిత్రాలతో పుంజుకుంటే తప్ప మన స్టార్‌ దర్శకులు అతనితో పని చేసే అవకాశమయితే లేదు. 

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?