Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ విష‌యం మీతో పంచుకోవ‌డం చాలా...

ఈ విష‌యం మీతో పంచుకోవ‌డం చాలా...

స‌మీరా ష‌రీఫ్‌...యాంక‌ర్‌గా, బుల్లితెర న‌టిగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. సోష‌ల్ మీడియాలో స‌మీరా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త వివ‌రాల‌ను ఆమె అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఇటీవ‌ల బుల్లితెర‌కు దూర‌మైనా ...అభిమానుల మ‌న‌సుల్లో మాత్రం త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.

2006 లో ఆడపిల్ల అనే సీరియల్‌తో స‌మీరా కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర నటుడు ప్రభాకర్‌తో క‌లిసి ఎన్నో సీరియల్స్ లో నటించారామె. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి త‌దిత‌ర సీరియల్స్ తో పాటు నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి యాంకర్‌గా కూడా న‌టించారామె.

ఇదిలా ఉండ‌గా త‌న జీవితంలో అత్యంత సంతోష‌క‌ర‌మైన విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. అది కూడా వినూత్నంగా స‌మీరా, ఆమె భ‌ర్త అన్వ‌ర్ పంచుకోవ‌డం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఇది కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లో తాను ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న‌ట్టు స‌మీరా వెల్ల‌డించారు.

త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని భ‌ర్త‌తో క‌లిసి డిఫెరెంట్‌గా పంచుకోవ‌డం గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి. సమీరాతో పాటు ఆమె భర్త అన్వర్‌ ఒకే కలర్‌ టీషర్ట్స్‌ ధరించి, దానిపై ‘ఈ విషయం మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. త్వరలో మా జీవితంలోకి ఓ బేబీ రాబోతుంది'' అని టీష‌ర్ట్స్‌పై రాసుకొచ్చారు. 

ఈ ఫొటోని సమీరా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది. త‌ల్లి కాబోతున్న స‌మీరాకు, అలాగే తండ్రిగా ప్ర‌మోష‌న్ పొంద‌నున్న అన్వ‌ర్‌కు నెటిజన్ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?