టోటల్ మెంబర్స్ తో గిల్డ్ సమావేశం

కరోనా నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కిందా మీదా అవుతోంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ చకచకా జూమ్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇండస్ట్రీ సమస్యలు, థియేటర్లు, షూటింగ్ లు, రిలీజ్ లు, ఫైనాన్స్ ఇలా చాలా సమస్యలను…

కరోనా నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కిందా మీదా అవుతోంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ చకచకా జూమ్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇండస్ట్రీ సమస్యలు, థియేటర్లు, షూటింగ్ లు, రిలీజ్ లు, ఫైనాన్స్ ఇలా చాలా సమస్యలను తరచు డిస్కస్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా 21 మంది సభ్యుల కోర్ కమిటీ మధ్యనే జరుగుతోంది.

కానీ ఇప్పుడు టోటల్ అంటే దాదాపు 40 మంది సభ్యులతో ఈ మంగళవారం సాయంత్రం జూమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో కోర్ కమిటీ సభ్యులు పాల్గొనడం లేదు. ఆ మధ్య జరిగిన కోర్ కమిటీ సమావేశంలో జరిగిన డిస్కషన్ లే ఇప్పుడు మిగిలిన సభ్యులు అందరితో డిస్కస్ చేస్తారు.

విడుదలలు ఎలా ప్లాన్ చేసుకోవాలి. షూటింగ్ లు ఎలా ప్లాన్ చేసుకోవాలి. కాస్ట్ కటింగ్, క్రూ కటింగ్ తదితర విషయాలు, అలాగే పారితోషికాల సంగతులు డిస్కస్ చేస్తున్నట్లు బోగట్టా. ప్రస్తుతం కరోనా పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో  షూటింగ్ లు జరిగేలా లేవు. కనీసం జూలై కాదు కదా, ఆగస్టులో అయినా స్టార్ట్ అవుతాయా లేదా అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చేయాలి? అన్నది జూమ్ సమావేశంలో డిస్కషన్ జరుగుతోందని తెలుస్తోంది.

పార్క్ హయత్ లో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ ర‌హ‌స్య స‌మావేశం