Advertisement

Advertisement


Home > Movies - Movie News

కంగ‌నాపై దేశ ద్రోహం కేసు

కంగ‌నాపై దేశ ద్రోహం కేసు

బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్‌తో పాటు ఆమె సోద‌రిపై దేశ ద్రోహం కేసు న‌మోదు చేయాల‌ని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రో పాలిట‌న్ కోర్డు ఆదేశించింది. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత కంగ‌నా ఒక్క‌సారిగా వివాదాస్ప‌ద న‌టిగా దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. బాలీవుడ్‌లో నెపోటిజం వ‌ల్లే సుశాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారంటూ కంగ‌నా తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

కంగ‌నా విమ‌ర్శ‌లు చినికి చినికి గాలివాన‌గా మారిన చందంగా ... మ‌హారాష్ట్ర స‌ర్కార్ వ‌ర్సెస్ కంగ‌నా అన్న‌ట్టు సీన్ క్రియేట్ అయ్యింది. మ‌రీ ముఖ్యంగా ముంబైని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌గా పోల్చ‌డంతో మ‌హారాష్ట్ర స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకొంది. పోలీసుల ర‌క్ష‌ణ వ‌ల‌యంలో కంగ‌నా ముంబైకి వెళ్లాల్సి వ‌చ్చింది.

మ‌హారాష్ట్ర స‌ర్కార్‌తో పాటు ముంబైపై, ఆ రాష్ట్ర పోలీసుల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటైన వ్యాఖ్య‌లు చేశారామె. అలాగే ప‌లు చాన‌ళ్లకు, సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు కంగ‌నా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్ట‌ర్‌, ఫిట్నెస్ ట్రైన‌ర్  మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు.  

ముంబై పోలీసులను బాబర్స్ అంటూ కంగన పోల్చడంపై కూడా అందులో ప్ర‌స్తావించారు.  ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం ఏ మలుపు తిర‌గ‌నుందో కాల‌మే తేల్చాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?