Advertisement

Advertisement


Home > Movies - Movie News

ట్రెండ్‌ సెట్టర్‌ సమంత

ట్రెండ్‌ సెట్టర్‌ సమంత

సోలో హీరోయిన్‌గా ఇరవై కోట్ల బిజినెస్‌ చేసే సత్తా వుందని 'ఓ బేబీ'తో నిరూపించిన సమంత వెంటనే అలాంటి చిత్రాలు చేయడంపై ఫోకస్‌ చేస్తుందని భావిస్తారు. కానీ సమంత మాత్రం తెలివిగా నిర్ణయాలు తీసుకుంటోంది. కథల ఎంపికలో తనదైన శైలి చాటుకుంటూ వరుస విజయాలు సాధిస్తోన్న సమంత సౌత్‌ సినిమా ఇండస్ట్రీ నుంచి ముందుగా వెబ్‌ సిరీస్‌ చేస్తూ ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ తీసే ఒక వెబ్‌ సిరీస్‌లో సమంత నటిస్తోంది. ఆమె కోసం చాలా మంది నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నా కానీ ఈ సిరీస్‌లో నటించాలనే నిర్ణయం తీసుకుని మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. బాలీవుడ్‌లో ముందుగా వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సైఫ్‌ అలీ ఖాన్‌ ముందుకొచ్చాడు. త్వరలో షారుక్‌ ఖాన్‌ కూడా ఒక వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నాడు. ఫ్యూచర్‌ వెబ్‌ సిరీస్‌ల పైనే నడుస్తుందని తెలిసినా దక్షిణాది తారలు ఇంకా ధైర్యం చేయడంలేదు.

సమంత తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో వెబ్‌ సిరీస్‌ మేకింగ్‌పై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ సిరీస్‌ కనుక క్లిక్‌ అయితే టయర్‌ 2కి చెందిన చాలా మంది స్టార్స్‌ ఈ దిశగా వస్తారు. సినిమా రంగంలో ఇంకా టాప్‌లో వుండగానే సమంత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంటెంట్‌ మేకర్స్‌ హర్షిస్తున్నారు. 

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?