Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది కూడా లేనట్లే

త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది కూడా లేనట్లే

2020 సంక్రాంతి. త్రివిక్రమ్..బన్నీ కాంబో అలవైకుంఠపురములో...ఓ దుమ్ము దులిపేసింది. కానీ అప్పటి నుంచీ ఖాళీగానే వున్నారు త్రివిక్రమ్. 

కరోనా ఒకటి, రెండు, మూడు ఫేజ్ లు అడ్డంగా అడ్డం పడిపోయాయి. ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నారు. కొంత టైమ్ గడిచిపోయింది. మహేష్ కు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం దాని మీదే వున్నారు. 

కానీ 2023 సంక్రాంతి వరకు త్రివిక్రమ్ సినిమా తెరమీదకు రాదని వినిపిస్తోంది. అంటే అప్పటికి సరిగ్గా మూడేళ్లు అవుతుంది. ప్రస్తుతం మహేష్ సర్కారువారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెకండాఫ్ స్క్రిప్ట్ ను మళ్లీ ఫైన్ ట్యూన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మార్చి నుంచి కానీ మహేష్ షూటింగ్ కు రారని బోగట్టా. మరి సర్కారు వారి పాట అప్పుడు ప్రారంభిస్తే ఎప్పటికి ముగిస్తారో? ఎప్పటికి ముగించినా, ఎంత ఫాస్ట్ గా రెడీ చేసినా, త్రివిక్రమ్ - మహేష్ సినిమా దసరా వేళకు రెడీ అవుతుందా అన్నది అనుమానమే?

త్రివిక్రమ్ బ్యాక్ ఎండ్ లో వుండి ఫినిష్ చేసిన భీమ్లానాయక్ విడుదలకు రెడీ గా వుంది. అదే ఆయన లేటెస్ట్ అనుకోవాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?