cloudfront

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్ సినిమాలో ఆ ఇద్దరూ

త్రివిక్రమ్ సినిమాలో ఆ ఇద్దరూ

హిట్ అంటే ఏంటీ? అనే రేంజ్ లో మొహం వాచి ఎదురుచూస్తున్న చిన్న హీరోలు ఆ ఇద్దరు. ఎక్కడో ఒకటి దారితప్పి హిట్ అయిందేమో కానీ, చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. అలాంటి ఇద్దరు చిన్న హీరోలకు తన సినిమాలో చాన్స్ ఇస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్.

హీరో నాగార్జున మేనల్లుడు సుశాంత్, నవదీప్ లు ఇద్దరూ బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లోని సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పప్పుసుద్ద టైపు క్యారెక్టర్ ఒకటి వుందట. అది సుశాంత్ కు ఇచ్చారు. మరి నవదీప్ ఏం క్యారెక్టర్ చేస్తున్నాడో ఇంకా బయటకు రాలేదు.

త్రివిక్రమ్ సినిమాల్లో వుండే రావురమేష్, సునీల్, రాజేంద్రప్రసాద్ వీళ్లంతా మామూలే. అయితే శ్రీనివాసరెడ్డిని వదిలేసినట్లున్నారు. కొత్తగా రాహుల్ రామకృష్ణ వచ్చి చేరాడు టీమ్ లో. ఇదిలావుంటే టబు ఈ సినిమాలో కీలకపాత్రను, అంటే హీరో తల్లి పాత్రను పోషిస్తోంది.

అల్లుఅర్జున్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను