సైజ్ జీరో హీరోయిన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

ముద్దుగుమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ మెహ్రీన్ విషయంలో ఇది తప్పయింది. బొద్దుగా కనిపించి, అందర్నీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ, పనిగట్టుకొని మరీ స్లిమ్ అయింది. ఏకంగా సైజ్ జీరో సాధించింది.  అంతా ఓకే…

ముద్దుగుమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ మెహ్రీన్ విషయంలో ఇది తప్పయింది. బొద్దుగా కనిపించి, అందర్నీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ, పనిగట్టుకొని మరీ స్లిమ్ అయింది. ఏకంగా సైజ్ జీరో సాధించింది.  అంతా ఓకే అని ఆమె అనుకుంది. కానీ ఆమె లుక్ నాట్ ఓకే అంటోంది సోషల్ మీడియా.

అవును.. మెహ్రీన్ లుక్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ పడుతున్నాయి. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది మెహ్రీన్. ఆ పిక్స్ లో బక్కపల్చగా కనిపిస్తోంది ఈ భామ. ఆమె ముఖంలో మెరుపు కూడా తగ్గిపోయింది. ఇదే విషయాల్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.

బక్కపల్చని పర్సనాలిటీతో మెహ్రీన్ బాగాలేదంటున్నారు చాలామంది. మునుపటిలా ఆమె కాస్త బొద్దుగా ఉంటేనే అందం అంటున్నారు. మరికొందరైతే ఆమె ఫిజిక్ కు సెంటిమెంట్ కూడా యాడ్ చేస్తున్నారు.

బొద్దుగా ఉన్నప్పుడు మెహ్రీన్ కు వరుసగా అవకాశాలొచ్చాయని, సక్సెస్ లు కూడా వచ్చాయని.. పల్చగా మారిన తర్వాత ఆమెకు సక్సెస్ లు తగ్గడంతో పాటు అవకాశాలు కూడా తగ్గిపోయాయంటున్నారు.

ఈ సెంటిమెంట్ సంగతి పక్కనపెడితే, నిజంగానే మెహ్రీన్ కు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఎఫ్3 తర్వాత మళ్లీ ఆమె కనిపించలేదు. స్లిమ్ అవ్వడం కోసం ఆమె గ్యాప్ తీసుకుందా లేక ఆమెకు నిజంగానే అవకాశాలు తగ్గాయా అనే విషయం మెహ్రీన్ కే తెలియాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది.

Click Here For Photo Gallery