cloudfront

Advertisement


Home > Movies - Movie News

మోడీపై సెటైర్లు మామూలుగా లేవు!

మోడీపై సెటైర్లు మామూలుగా లేవు!

ఎందుకు తీస్తున్నారో కూడా తెలియడం లేదు కానీ.. ఉన్నఫలంగా మోడీపై ఒక బయోపిక్ మొదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ వంటి పేరున్న నటుడు మోడీగా కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇక్కడ నుంచినే అసలు కామెడీ మొదలైంది.

మోడీతో ఏమాత్రం పోలిక లేనట్టుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పై ఇంటర్నెట్ లో ట్రోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ ఫస్ట్ లుక్ లోని స్టిల్ అటు మోడీలాగానూ లేదు, ఇటు వివేక్ ఒబెరాయ్ లానూ లేదంటూ.. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మోడీ రూపు రేఖల్లో ఏమాత్రం పోలిక లేనట్టుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఈబయోపిక్ ను రూపొందించాలనుకున్న మోడీ భక్తులకు రివర్స్ పంచ్ లా మారుతోంది.

ఇదివరకూ చంద్రబాబునాయుడు బయోపిక్ అంటూ.. ఒక స్టిల్ ఒకటి వచ్చింది. బాబుగారి గడ్డాన్ని పోలిన గడ్డం పెట్టబోయి ఆభాసుపాలయ్యారు దాని రూపకర్తలు. ఆ చంద్రోదయం ఏమైందో కూడా మళ్లీ జాడలేదు. ఇక మోడీ బయోపిక్ స్టిల్ కాస్తా.. అటూ ఇటూగా చంద్రబాబు బయోపిక్ స్టిల్ లాగానే కామెడీగా ఉంది.

‘లోనవల లోని వ్యాక్స్ మ్యూజియంలో మోడీ స్టాచ్యూ కూడా ఇంతకన్నా కాస్త మోడీతో ఎక్కువ పోలికలతో ఉంటుంది.. “అంటూ మొదలుపెట్టి నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.

‘వివేక్ ఒబెరాయ్ తో మోడీ బయోపిక్కా.. అర్బాజ్ ఖాన్ తో రోజర్ ఫెదరర్ బయోపిక్ తీసేందుకు ఎవరైనా ట్రై చేయండి..” అంటూ మరో పంచ్ పడింది.

‘మొదటి స్టిల్ Adidas అయితే రెండోది Abidas’ అంటూ పాపులర్ బ్రాండ్ల నకలుగా వచ్చే ఫేక్ బ్రాండ్లు గుర్తుచేస్తూ ఇంటో ట్వీట్ వైరల్ అవుతోంది.

‘మొదటి ఫొటో.. నరేంద్రమోడీ, రెండోఫొటో.. యాక్సిడెంటల్ నరేంద్రమోడీ” అనే ఫన్ కూడా పండుతోంది. మొత్తానికి అయ్యావారిని చేయబోతే కోతి అయ్యిందని ఒక సామెత. ఈ బయోపిక్ గొడవ ఎందుకు వచ్చిందో కానీ.. నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు!

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్