cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మా ఆయ‌న‌కు తెలియ‌కుండా పూరికి డ‌బ్బులిచ్చేదాన్ని...

మా ఆయ‌న‌కు తెలియ‌కుండా పూరికి డ‌బ్బులిచ్చేదాన్ని...

న‌టి హేమ‌. రీల్ లైఫ్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ వేసి అంద‌రి అభిమానాన్ని చూర‌గొన్నారు. రియ‌ల్ లైఫ్‌లో చాలా భోళా మ‌నిషి అని పేరు తెచ్చుకున్నారు. ఏదీ మ‌న‌సులో దాచుకోరు. ఉన్న‌టి ఉన్న‌ట్టు మాట్లాడే స్వ‌భావంతో ఒక్కోసారి ఇబ్బందులు కూడా వ‌స్తుంటాయి. కానీ అవేవీ ఆమె ప‌ట్టించుకోరు.  

ఇటీవ‌ల నెల్లూరులో బీజేపీలో చేరిన ఆమె వేదిక‌పై ఎంత అమాయ‌కంగా మాట్లాడారో అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల హేమ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. త‌న‌వైన అభిప్రాయాలు అభిమానుల‌తో పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తీయ‌టి విష‌యాలు ఆమె మాట‌ల్లోనే...

'నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌.  సింగిల్‌ ఎపిసోడ్స్‌కు డైరెక్ష‌న్ చేసేవారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది.  అప్పట్నుంచి బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌లా ఉండేవాళ్లం. మా ఫ్యామిలీకి పూరీ ఎంత క్లోజ్‌ అంటే..అతను ఉంటేనే నన్ను షూటింగ్స్‌కు పంపేవారు. 

ఒంటరిగా వెళ్లనిచ్చేవారు కాదు. ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే నన్నే అడిగివాడు. ఆ టైంలో మా ఆయన ఒక్కరే వర్క్‌ చేసేవాడు. దీంతో ఉన్నదాంట్లోనే  మా ఆయనకు తెలియకుండా పూరికి డబ్బులిచ్చేదాన్ని. ఐదందలు, వెయ్యి ఇలా పోపు డబ్బాల్లో దాచుకొని ఇచ్చేదాన్ని' అని చెప్పుకొచ్చారామె.

ఇంత‌టితో హేమ ఆగ‌లేదు. ఇంకా పూరి పెళ్లి సంగ‌తులు కూడా హేమ ఆస‌క్తిక‌రంగా చెప్పుకొచ్చారు. పూరి పెళ్లికి తాను ఏ విధంగా సాయ‌ప‌డ్డారో కూడా తెలిపారు.

'ఓ షూటింగ్‌లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని పరిచయం చేశాడు.. ఆ అమ్మాయి లావణ్య . పెద్దవాళ్లెవరూ లేకపోతే భర్తతో కలిసి కాళ్లు కడిగి కన్యాదానం చేశా. అలా పూరి జగన్నాథ్‌కి నేను అక్కతో పాటు అత్తనవుతాను' అని హేమ చెప్పుకొచ్చారు. పూరితో త‌న అనుబంధం గురించి హేమ చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హేమ ఇలాంటి మంచి ప‌నులు ఇంకా ఎన్నెన్ని చేశారో అని కామెంట్స్ రావ‌డం గ‌మ‌నార్హం. 

గడ్డం పెంచగానే మాస్ లీడర్ అయిపోవు లోకేష్

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×