Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా కోడ‌లి ధైర్యానికి కండోమ్ స్క‌ర్టే సాక్ష్యం

మెగా కోడ‌లి ధైర్యానికి కండోమ్ స్క‌ర్టే సాక్ష్యం

భార‌తీయ స‌మాజంలో కొన్నింటి గురించి మాట్లాడ్డానికి సంప్ర‌దాయాలు అడ్డొస్తాయి. దీంతో న‌లుగురు క‌లిసి చ‌ర్చించుకోవాల్సిన అంశాల‌పై కూడా మౌనం పాటిస్తుండ‌టం చూస్తున్నాం. మ‌రీ ముఖ్యంగా లైంగిక ప‌ర‌మైన అంశాల్లో చాలా పొదుపుగా మాట్లాడ్డం తెలిసిందే. ముఖ్యంగా ఎయిడ్స్ నిరోధానికి , సుర‌క్షిత సెక్స్ సంబంధాల‌కు ప్ర‌భుత్వం కండోమ్స్ వాడాల‌ని సూచిస్తోంది. అయితే స‌మాజం ఆధునికంగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నా కండోమ్స్ గురించి మాట్లాడ్డానికి ఇంకా జంకాల్సిన ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో ఏకంగా కండోమ్ స్క‌ర్ట్ వేసుకున్న ఓ యువ‌తి మ‌న ముందు ప్ర‌త్య‌క్ష‌మైతే...అయితే ఏంటి? మ‌న మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, యంగ్ హీరో రామ‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కండోమ్ స్క‌ర్ట్ ధ‌రించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంత‌టితో ఆమె ఆగ‌లేదు. ఆమె స‌వాల్ విస‌ర‌డంలోనే కండోమ్ గురించి మ‌న వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి అభిప్రాయాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

అపోలో ఉపాధ్య‌క్షురాలిగా ఉపాస‌న ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. త‌నలో మెదిలే వినూత్న ఆలోచ‌న‌ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసుకుంటారు.

తాజాగా అలాంటి స‌రికొత్త ఐడియా ఆమెకొచ్చింది. లోకల్ డిజైనర్‌లు తిరస్కరించిన టెక్స్‌టైల్ స్క్రాప్‌తో తయారు చేసిన టాప్, పాడైపోయిన కండోమ్స్‌తో తయారు చేసిన స్కర్ట్ ధరించిన తన ఫోటోను సోష‌ల్ మీడియాలో ఉపాసన పోస్ట్ చేశారు. స‌మాజాన్ని అర్థం చేసుకున్న యువ‌తిగా...ఇలాంటి దుస్తులను ధరించడానికి ధైర్యం ఉందా అంటూ స‌వాల్ విస‌ర‌గ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఇత‌రుల ధైర్యం సంగ‌తి ప‌క్క‌న పెడితే...ఉపాస‌న ఎంత ధైర్య‌ప‌రురాలో ఈ ఫొటో ఓ సాక్షిగా మిగిలింది. ప్ర‌స్తుతం  ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?