Advertisement


Home > Movies - Movie News
ఉరమి ఉరిమి 'కోణిదెల' మీద

వేటగాడికే బాణం తగిలినట్లు, సిపాయి తుపాకి రివర్స్ లో ఫైర్ అయినట్లు వుంది మహేష్ కత్తి పరిస్థితి. ఇన్నాలు మహేష్ కత్తి అంటే ఓ క్రిటిక్. భయం, జంకు లేకుండా, సూటిగా, పదునుగా విమర్శలు, కామెంట్లు చేసే కామెంటేటర్.

అలాంటి వ్యక్తినే ఇప్పుడు ఆరోపణల ఉచ్చులో ఇరుక్కున్నారు. తనపై అత్యాచారం చేసినట్ల ఓ అమ్మాయి చానెల్ సాక్షిగా ప్రకటించింది. ఇప్పుడు దీన్ని ఖండించుకోవడం, తనను తాను నిరూపించుకోవడం అన్నది కత్తి మహేష్ సమస్య.

అయితే దీనిపై కోర్టును ఆశ్రయించబోతున్నట్లు మహేష్ కత్తి ప్రకటించారు. పరువునష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, తనపై ఆరోపణ చేసిన అమ్మాయితో పాటు కొణిదెల ప్రొడక్షన్స్ పై కూడా కేసు వేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక్కడ కొణిదెల ప్రొడక్షన్ వ్యవహారం ఏమిటంటే, కత్తి మీద అత్యాచార ఆరోపణలు చేయడానికి తెరవెనుక కారణం ఆ సంస్థే అంట. అలా అని ట్విట్టర్ లో మహేష్ కత్తి ఆరోపించారు.

అంటే ఇప్పుడు వ్యవహారం మొత్తం ఆరోపించిన అమ్మాయి-కత్తిమహేష్ మధ్య నుంచి కొణిదెల కంపెనీ లేదా మెగా ఫ్యాన్స్ కు కత్తి మహేష్ కు మధ్య వ్యవహారంగా మారిపోతుంది.

అంటే ఒక విధంగా మహేష్ సరైన ఎత్తుగడ వేసారనే చెప్పాలి. ఇప్పుడు వ్యవహారం మళ్లుతుంది. జనాల దృష్టీ మళ్లుతుంది. కావాలంటే డిష్కషన్లు ఆ కోణంలో పెట్టుకోవచ్చు. లేదా ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించేయవచ్చు.