Advertisement

Advertisement


Home > Movies - Movie News

'వకీల్' - నో మిడ్ నైట్ షోలు

'వకీల్' - నో మిడ్ నైట్ షోలు

పవన్ ఫ్యాన్స్ కు కాస్త నిరుత్సాహం తప్పదు. వకీల్ సాబ్ కు అర్థరాత్రి ప్రత్యేక ఆటలు, బెనిఫిట్ షో లు వుండవు. అనుమతులు వస్తే తెల్లవారు ఝామున నాలుగున్నర తరువాత నుంచి షో లు వుంటాయి. లేదూ అంటే రెగ్యులర్ షో లే. 

నిర్మాత దిల్ రాజు ఈ మేరకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. నాలుగున్నర లోపు కీ లు ఇవ్వ వద్దని క్యూబ్ కు పక్కాగా ఆదేశాలు అందించారు. 

వకీల్ సాబ్ మాస్ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా.ఇలాంటి సినిమాకు అర్థరాత్రి ఆటలు వేస్తే టాక్ వేరేగా వెళ్లే ప్రమాదం వుంది. అందుకే దిల్ రాజు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చేసారు.

ఇక మిగిలిన ఆశ ఒక్కటే. ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే అయిదు గంటలకు షో లు పెట్టుకోవచ్చు. లేదంటే లేదు. దిల్ రాజు తనకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్లో వున్న సంబంధాలను ఉపయోగించి అదనపు ఆటల అనుమతి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వస్తుందనే నమ్మకంతో వున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?