cloudfront

Advertisement


Home > Movies - Movie News

వాల్మీకి డేట్ వచ్చేసింది

వాల్మీకి డేట్ వచ్చేసింది

వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా వాల్మీకి. ఈ సినిమాకు డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 6న విడుదలకు ముహుర్తం పెట్టేసారు. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. తమిళ హీరో అధర్వ మురళి కీలకపాత్ర పోషిస్తున్నారు.

వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ కాస్త నెగిటివ్ షేడ్ వున్న రఫ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. హరీష్ శంకర్ డిజె సినిమా తరువాత మళ్లీ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇదే. అందువల్ల ఈ సినిమా మీద కాస్త మంచి అంచనాలే వున్నాయి.

అందుకే వరుణ్ తేజ్ కూడా తను గీతాలో చేయాలనుకున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని వెనక పెట్టి, ఈ సినిమా ముందు చేసారు. 

దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. ప్రస్తుతం టాకీ షూట్ చివరిషెడ్యూలుకు రెడీ అవుతున్న ఈ సినిమా విడుదల డేట్ కు చాలా ముందుగానే రెడీ అయిపోతుందని, అయితే ఆగస్టులో ఖాళీ లేక, సెప్టెంబర్ కు ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు