cloudfront

Advertisement


Home > Movies - Movie News

మాజీ ప్రియుడిని చంపుతానంటున్న హీరోయిన్!

మాజీ ప్రియుడిని చంపుతానంటున్న హీరోయిన్!

తనదైన మాటతీరుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఏనాటికి అయినా తమిళనాడు సీఎం కావడమే లక్ష్యమని ప్రకటించుకోగల ధైర్యం ఎవరికి ఉంది? అలాంటి కోరికలను చాలామంది నటీనటులు మనసులోనే పెట్టుకుని ఉండవచ్చు. వరలక్ష్మి మాత్రం తను రాజకీయాల్లో కూడా రాణిస్తాననే నమ్మకాన్ని బయటకే వ్యక్తంచేస్తూ ఉంటుంది. అదీ ఈమె తీరు.

ఇక తాజాగా తన మాజీప్రియుడు విశాల్ విషయంలో సరదాగానే అయినా ఆసక్తిదాయకంగా స్పందించింది శరత్ కుమార్ తనయ. ఒక ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో వరలక్ష్మి ఆన్సర్లు ఆసక్తిదాయకంగా ఉంది. ఎవరికైనా ముద్దు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తావు.. అనే ప్రశ్నకు శింబు పేరును సమాధానంగా ఇచ్చింది వరలక్ష్మి. ఆ హీరో మీద ఇలా ప్రేమను వ్యక్తంచేసింది.

ఇక ఎవరైనా చంపాలని ఉందా అంటే.. నవ్వుతూనే విశాల్ పేరు చెప్పింది. విశాల్ తో గతంలో వరలక్ష్మి ప్రేమాయణాన్ని నడిపించిందనే ప్రచారం ఉంది. వీరిద్దరూ ఆ విషయాన్ని ద్రువీకరించలేదు  కానీ.. ప్రేమలో మునిగి తేలారని అంటారు. అయితే అనంతరం బ్రేకప్ జరిగింది.

బ్రేకప్ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి నటించారు కూడా. అయినప్పటికి విశాల్ మీద వరలక్ష్మికి చిరు కోపం ఉన్నట్టుగా ఉంది. ఇక పెళ్లి ఎవరిని చేసుకుంటావ్ అంటే.. వీరిద్దరినీ కాకుండా మరెవరిని అయినా అని ఆన్సర్ ఇచ్చింది ఈ నటీమణి.

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్