cloudfront

Advertisement


Home > Movies - Movie News

'అల్లు' విమర్శలకు ఆర్జీవీ జవాబులు

'అల్లు' విమర్శలకు ఆర్జీవీ జవాబులు

ప్రత్యేకంగా వర్మను తిట్టడం కోసమే మీడియా సమావేశం ఏర్పాటుచేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. నాగబాబు ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే అరవింద్ కూడా మీడియాను పిలిచి వర్మను చెడామడా తిట్టారు. ఏకంగా వర్మను నీచుడు, నికృష్ణుడు అనేశారు. నిజానికి వర్మ చేసిన పనికి ఈ తిట్లు కూడా చిన్నవే. అయితే ఇంతటితో ఈ వ్యవహారాన్ని వదిలేయకుండా.. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కు వర్మ వివరణ ఇచ్చాడు.

అల్లు అరవింద్ గారి కామెంట్స్ కు నా సమాధానమంటూ వర్మ చాలా సుదీర్ఘంగా స్పందించాడు. ఇండస్ట్రీకి ద్రోహం చేస్తున్నాడంటూ అరవింద్ చేసిన ఆరోపణను వర్మ తిప్పికొట్టారు. తను ఇండస్ట్రీకి ద్రోహం చేయడం లేదని, లక్షలాది మంది పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసి తనకుతాను ద్రోహం చేసుకున్నానని వర్మ తెలిపాడు.

కళామతల్లి పాలు తాగి రొమ్ము గుద్దాడని అరవింద్ చేసిన వ్యాఖ్యలపై వర్మ సీరియస్ అయ్యాడు. ఇండస్ట్రీ మీరా లేక పవన్ కల్యాణా? మీరు నాకు బ్రేక్ ఇచ్చారా? అని ప్రశ్నించాడు. శ్రీరెడ్డి ద్వారా పవన్ ను తిట్టించడం ద్వారా తన రొమ్మును తానే గుద్దుకున్నానని కామెంట్ చేశాడు వర్మ.

"అరవింద్  గారు మీ మీద నాకు చాలా గౌరవముంది.. ఎప్పటికీ ఉంటుంది.. 100% నేను చేసింది క్షమించరాని తప్పు.. మళ్ళీ ఇంకొకసారి మీకు, పవన్ కళ్యాణ్ కి మీ కుటుంబ సభ్యులకీ ఫాన్స్ కీ  అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంతే కాకుండా మళ్ళీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మీ మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను. గతంలో నా ఒట్లు నేను నిలబెట్టుకోకపోయుండచ్చు కానీ మా మదర్ మీద నేనెప్పుడూ ఒట్టేయ్యలేదు"

ఇలా తన తల్లిమీద ఒట్టేసి ఈ మేటర్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఆ వెంటనే పవన్ ను పొగుడుతూ వర్మ వరుసగా ట్వీట్స్ చేయడం విశేషం.