cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

వితిక అవాక్కయ్యేలా వ‌రుణ్ చేసిందేమిటి?

వితిక అవాక్కయ్యేలా వ‌రుణ్ చేసిందేమిటి?

వ‌రుణ్ సందేశ్‌, వితిక జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. వీరిలో వ‌రుణ్ అమాయ‌క‌త్వం, వితిక తెలివితేట‌లు అబ్బుర‌పరుస్తాయి. బిగ్‌బాస్‌-3లో 90 రోజుల పాటు ఈ జంట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకొంది. ఆచితూచి మాట్లాడే వ‌రుణ్‌, గ‌ళాగ‌ళా సెల‌యేటి ప్ర‌వాహాన్ని మ‌రిపించే వితిక మాట‌లు...బిగ్‌బాస్ షోలో హైలెట్‌గా నిలిచాయి.

 ‘ఆలీతో స‌ర‌దాగా’ కార్య‌క్ర‌మంలో ఆ జంట త‌మ ప్రేమ‌, పెళ్లి, బిగ్‌బాస్ షో...వ్య‌క్తిగ‌త‌, కుటుంబ విష‌యాలు...ఇలా అనేక సంగ‌తుల‌ను పంచుకున్నారు.  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు ద‌గ్గ‌ర బ‌ల్లిపాడు వ‌రుణ్ స్వ‌స్థ‌లం. వితిక‌ది భీమ‌వ‌రం.

తాను  ‘హ్యాపీడేస్‌’తో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాన‌ని, ‘కొత్త బంగారు లోకం’తో మంచి పేరు తెచ్చుకున్న‌ట్టు వ‌రుణ్ చెప్పాడు. హ్యాపీడేస్ చేసే  నాటికి త‌న‌కు 18 ఏళ్లు అని చెప్పాడు.  ‘ప‌డ్డానండీ ప్రేమ‌లో మ‌రి’ అనే సినిమాలో వ‌రుణ్‌, త‌ను క‌లిసి ప‌నిచేసిన‌ట్టు వితిక తెలిపారు. అప్పుడే మొట్ట‌మొద‌టి సారిగా వ‌రుణ్‌ను చూసిన‌ట్టు ఆమె చెప్పారు.

మొద‌ట్లో త‌మ‌కు పెళ్లి చేసుకోవాల‌ని లేన‌ట్టు వ‌రుణ్ చెప్పాడు. కానీ వితిక ప్ర‌పోజ్ చేయ‌డంతో త‌న‌కు న‌చ్చి ఓకే అన్న‌ట్టు అత‌ను తెలిపాడు. పెళ్లికి ముందే వితిక త‌ల్లిని క‌లిశాన‌ని, ఆమె త‌న‌తో బాగా మాట్లాడే వార‌ని చెప్పాడు. అలాగే త‌న త‌ల్లిదండ్రులు వితిక‌ను చూడ‌గానే త‌మ కోడ‌లిగా ఫిక్స్ అయ్యార‌ని చెప్పాడు.

వితిక స్పందిస్తూ పెళ్లి గురించి పెద్ద‌ల‌కు ముందు చెప్ప‌లేద‌ని తెలిపారు. త‌మ రిలేష‌న్ గురించి చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యించుకున్న‌ట్టు వితిక తెలిపారు. దీంతో పెళ్లి గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోయిన‌ట్టు ఆమె తెలిపారు.

వితిక్ త‌న‌ను డామినేట్ చేస్తుంద‌ని, ఆమే త‌న‌కు బాస్‌, బిగ్‌బాస్ అని వ‌రుణ్ న‌వ్వుతూ చెప్పాడు. వితికే త‌న జీవిత‌మ‌ని, త‌న‌ను పిల్ల‌వాడిలా చూసుకుంటుంద‌ని వ‌రుణ్ చెప్పాడు. త‌న స‌పోర్ట్ లేక‌పోతే ఇక్క‌డ ఉండేవాడిని కాద‌న్నాడు. బిగ్‌బాస్‌లో 90 రోజుల పాటు ఇద్ద‌రూ క‌లిసి ఉండ‌టం వ‌ల్ల త‌మ మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింద‌న్నాడు.

త‌మిళ్‌, క‌న్న‌డ‌, తెలుగులో తాను మొత్తం ఆరు సినిమాలు చేసిన‌ట్టు వితిక తెలిపారు.  తాను 20కి పైగా సినిమాలు చేసిన‌ట్టు వ‌రుణ్ తెలిపాడు. తాను సినిమాల్లో అప‌జ‌యాలు ఎదుర్కొన్న త‌ర్వాత ఎన్నో నేర్చుకున్న‌ట్టు వ‌రుణ్ తెలిపాడు. మ‌న‌తో ఎవ‌రున్నారు? ఎవ‌రు త‌ప్పించుకున్నారో ...ఆ స‌మ‌యంలోనే తెలిశాయన్నాడు. ప్ర‌తి రంగంలో జ‌యాప‌జ‌యాలు ఉంటాయ‌న్నాడు. రెండింటిని కూడా పాజిటివ్‌గా తీసుకున్న‌ట్టు వ‌రుణ్ చెప్పాడు.

ప‌రిచ‌యం అయిన కొత్త‌లో మీద చేయి వేసి మాట్లాడితే వ‌రుణ్  దూరంగా జ‌రిగేవాడ‌ని వితిక ఆశ్చ‌ర్యంగా చెప్పారు. ఆ స‌మ‌యంలో అవాక్కైన‌ట్టు ఆమె  అమాయ‌కంగా న‌వ్వుతూ చెప్పారు.

ఫ్యాన్స్ తో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ