cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

వరుణ్ సందేశ్..ఇందువదన

వరుణ్ సందేశ్..ఇందువదన

హ్యాపీ డేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకంతో ప్రామిసింగ్ అనిపించుకుని, ఆ తరువాత సరైన సినిమాలు పడక, పడినా హిట్ కాక, సర్రున కిందకు జారిపోయాడు హీరో వరుణ్ సందేశ్.

బిగ్ బాస్ ఎంట్రీ కూడా పెద్దగా కలిసిరాలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత ఓ సరైన ప్రాజెక్టు తో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందువదన అనే టైటిల్ తో తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాడు వరుణ్ సందేశ్.

పోస్టర్ లో హీరో హీరోయిన్లు వరుణ్-ఫర్నాజ్ శెట్టి టాప్ లెస్ గా క్రేజీగా కనిపిస్తున్నారు. వరుణ్ కాస్త బాడీ బిల్డ్ చేసి, కోర మీసంతో కొత్తగా కనిపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సెమీ న్యూడ్ స్టిల్ అయినా, కాస్త కళాత్మకంగా వుండేలా చూసుకున్నారు. 

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై మాధవి ఆదుర్తి నిర్మించే ఈ సినిమాకు  ఎమ్మెస్సార్ దర్శకత్వం వ‌హిస్తున్న‌ారు.  సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×