cloudfront

Advertisement


Home > Movies - Movie News

అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ

అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సినిమా చేసిన వెంకటేశ్.. వెంటనే ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. త్వరలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోతున్నట్టు స్వయంగా వెంకీ ప్రకటించాడు. అయితే అది ఎప్పుడనే విషయంపై మాత్రం ఈ సీనియర్ హీరో క్లారిటీ ఇవ్వలేదు.

ఎఫ్2 సినిమా సెట్స్ లోనే వెంకీ, అనీల్ రావిపూడి మధ్య కథాచర్చలు జరిగాయట. స్టోరీలైన్ నచ్చిన వెంకీ దాన్ని డెవలప్ చేయమని చెప్పాడట. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కంప్లీట్ నెరేషన్ నచ్చితేనే అనీల్ రావిపూడి సినిమా ఓకే అవుతుంది. లేదంటే మరో సినిమా వెదుక్కోవాల్సిందే.

అయితే ఈ విషయంలో అనీల్ రావిపూడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎఫ్2 లాంటి మల్టీస్టారర్ కథతో వెంకీని ఒప్పించిన ఈ దర్శకుడు.. కచ్చితంగా వెంకీతో మరో సినిమా చేయడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. అయినా సరే అనీల్ రావిపూడికి వెయిటింగ్ తప్పదు.

ఎందుకంటే వెంకీమామ షూటింగ్ పూర్తయిన తర్వాతే అనీల్ సినిమా ఉంటుంది. అటు చూస్తే వెంకీ మామ ఇంకా సెట్స్ పైకి రానేలేదు. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 సినిమా సంక్రాంతి కానుకగా రేపు థియేటర్లలోకి వస్తోంది.

మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీతో సంక్రాంతి సినిమాల సందడి ముగుస్తుంది.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?