cloudfront

Advertisement


Home > Movies - Movie News

పేరుకు 5 సినిమాలు.. ఎన్ని వస్తాయో చూడాలి!

పేరుకు 5 సినిమాలు.. ఎన్ని వస్తాయో చూడాలి!

కథలు ఒప్పించడంలో మెగా కాంపౌండ్ తర్వాత క్లిష్టమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రమే. ఒక్కోసారి మెగా కాంపౌండ్ నైనా ఒప్పించవచ్చేమో కానీ, దగ్గుబాటి సురేష్ లాంటి వ్యక్తుల్ని కథలతో కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, ఇప్పుడు వెంకటేష్ చేతిలో ఏకంగా 5 సినిమాలున్నాయి. చెప్పుకోడానికి మాత్రమే ఈ ఐదు సినిమాలు. ఒకటి ఆల్రెడీ సెట్స్ పై ఉంది. మిగతావాటిలో ఎన్ని కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం.

ప్రస్తుతం వెంకీమామ అనే సినిమా చేస్తున్నాడు వెంకీ. ఈ సినిమాపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇది కచ్చితంగా థియేటర్లలోకి వచ్చి తీరుకుంది. ఆ తర్వాత సినిమానే డౌట్. వెంకీమామ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడంటూ పుకార్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన లేదు. బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన కథకు వెంకీ ఓకే చేశాడా లేదా అనేది అందరికీ డౌట్.

మరోవైపు తరుణ్ భాస్కర్ తో సినిమా కూడా ఇలాంటి వ్యవహారమే. స్వయంగా సురేష్ బాబు ఈ సినిమా గురించి ప్రకటించినప్పటికీ, సెట్స్ పైకి వస్తే తప్ప ప్రాజెక్టును నమ్మలేం. వెంకటేశ్, తరుణ్ మధ్య ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయంటున్నారు.

మరోవైపు అనీల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు వెంకీ ఖాతాలో ఉండనే ఉన్నారు. ఇప్పటికే అనీల్ రావివూడి, వెంకీ మధ్య ప్రాధమికంగా చర్చలు పూర్తయ్యాయి. మరోవైపు త్రివిక్రమ్-వెంకీ సినిమాను కూడా అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఈ రెండు సినిమాలపై క్లారిటీలేదు.

ఇలా వెంకటేష్ చేతిలో ఎన్నో సినిమాలున్నాయి. కానీ సెట్స్ పైకి వచ్చేవరకు ఏ ఒక్క సినిమాను నమ్మే పరిస్థితి లేదు. తేజ, అశోక్ లాంటి దర్శకుల్ని అడిగితే ఈ విషయాలు మరింత బాగా చెబుతారేమో.

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు