cloudfront

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్ సినిమా ఆగలేదు.. బాబి సినిమా కదల్లేదు

త్రివిక్రమ్ సినిమా ఆగలేదు.. బాబి సినిమా కదల్లేదు

వెంకీ దగ్గరకు ఓ కథ చేరిందంటే ఇక దాని గురించి మరిచిపోవచ్చనే అపవాదు ఉండనే ఉంది. కథ చెప్పి వెంకటేష్ ను మెప్పించడం చాలా కష్టమంటారు చాలామంది దర్శకులు. దీనికితోడు తేజ, అశోక్ లాంటి కొంతమంది దర్శకులు ఈ హీరోతో సినిమాలు ప్రకటించి మరీ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్-నాగచైతన్య కలిసి చేయాల్సిన వెంకీ మామ కూడా ఆలస్యమౌతోందంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా వెంకటేష్ స్పందించాడు.

"వెంకీ మామ ఆగిపోలేదు. కాస్త లేట్ అయిందంతే. నా నెక్ట్స్ సినిమా అదే.  అందులో చాలా ఎమోషన్ ఉంటుంది. అంతే స్థాయిలో కామెడీ కూడా ఉంటుంది. చాలామంచి స్క్రిప్ట్ అది. నేను, నాగచైతన్య సినిమా అంతా ఫుల్ లెంగ్త్ కనిపిస్తాం".

ఇలా వెంకీ మామ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వెంకటేశ్.. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాపై కూడా స్పష్టత ఇచ్చాడు. చాన్నాళ్ల కిందటే త్రివిక్రమ్ తో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ కథ సెట్ అవ్వలేదంటున్నాడు వెంకీ. ఇంకా చర్చల్లో ఉన్నామని, త్రివిక్రమ్ ఓ మంచి కథతో వస్తాడనే నమ్మకం తనకుందని అంటున్నాడు.

మరోవైపు గడిచిన నాలుగేళ్లుగా సినిమాలు తగ్గించారనే కామెంట్ పై సూటిగా రియాక్ట్ అయ్యాడు వెంకటేశ్. నాలుగేళ్లు కాదు.. పదేళ్లుగా సినిమాలు తగ్గించానని స్పష్టంచేశాడు. నచ్చని క్యారెక్టర్స్ చేయడం ఇష్టంలేదని, మరీ ముఖ్యంగా కృత్రిమంగా కనిపించే పాత్రలు చేయడం మానేశానని అంటున్నాడు.

ప్రస్తుతం తను కెరీర్ ను ప్లాన్ చేయడం మానేశానని, నచ్చిన క్యారెక్టర్ దొరికితే చేస్తానని లేదంటే గ్యాప్ తీసుకుంటానని క్లియర్ గా చెప్పేశాడు ఈ సీనియర్ హీరో.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది