Advertisement


Home > Movies - Movie News
వెంకీ-తేజ సినిమాకు డేట్ ఫిక్స్

వెంకటేష్, తేజ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమై చాలా రోజులైంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభంకాలేదు. గత నెలలోనే సినిమా సెట్స్ పైకి వస్తుందన్నారు. కానీ అది జరగలేదు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు మరో డేట్ ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 18 నుంచి వెంకీ-తేజ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.

నిజానికి ఈపాటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ తేజ తన పాత స్టయిల్ లోకి వెళ్లిపోయాడు. కొత్త నటీనటులు కావాలంటూ పిలుపునిచ్చాడు. వాళ్లకు టెస్ట్ కట్ చేశాడు. రిహార్సల్స్ కార్యక్రమం పెట్టాడు. ఇవన్నీ పూర్తయ్యేసరికి పుణ్యకాలం దాటిపోయింది. అలా నెలరోజులు ఆలస్యంగా సినిమా సెట్స్ పైకి వస్తోంది. 

వెంకీ-తేజ సినిమాలో దాదాపు 70శాతం మంది కొత్త ముఖాలే కనిపించబోతున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాకు ఫ్రెష్ నెస్ వస్తుందని యూనిట్ పైకి చెబుతున్నప్పటికీ నిర్మాతలకు దండిగా డబ్బులు మిగులుతాయనే విషయం అందరికీ తెలిసిందే. 

ఈ సినిమాకు ఆటనాదే-వేటనాదే అనే టైటిల్ అనుకుంటున్నారు. మూవీ సెట్స్ పైకి వచ్చిన తర్వాత హీరోయిన్లతో పాటు టెక్నీషియన్ల వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తారు. సురేష్ బాబు, అనిల్ సుంకర కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.