cloudfront

Advertisement


Home > Movies - Movie News

"ఎన్టీఆర్"కు షాకిచ్చిన విద్యాబాలన్..

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ప్రచారాన్ని చాలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సమయం, సందర్భం, టైమింగ్ చూసి మరీ ఫస్ట్ లుక్స్ వదుల్తున్నారు. ఇందులో భాగంగా చాలా గెటప్స్ ను రివీల్ చేశారు. ఇక  సినిమాకు సంబంధించి ఆసక్తి రేకెత్తించే క్యారెక్టర్ ఒక్కటే మిగిలి ఉంది. అదే బసవతారకం పాత్ర. ఆ లుక్ ను మంచి టైమ్ చూసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విద్యాబాలన్ షాకిచ్చింది.

ఎవరికీ చెప్పకుండా ఎన్టీఆర్ భార్య బసవతారకం లుక్ ను విద్యాబాలన్ విడుదల చేసేసింది. బసవతారకం గెటప్ లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న విద్యాబాలన్, ఓ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఆ ఫోటో కాస్తా వైరల్ అయిపోయింది. దీంతో "ఎన్టీఆర్" యూనిట్ తలపట్టుకుంది. 

మంచి టైమింగ్ చూసి బసవతారకం ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామనుకున్నాడు దర్శకుడు క్రిష్. కానీ అంతలోనే విద్యాబాలన్ అత్యుత్సాహం వల్ల ఆ లుక్ కాస్తా బయటకు వచ్చేసింది. పొరపాటు గ్రహించిన విద్యాబాలన్ వెంటనే ఆ పోస్ట్ ను తన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి తీసేసింది. కానీ అప్పటికీ ఆలస్యమైంది. ఆమె పెట్టిన ఫస్ట్ లుక్ స్టిల్ చాలామందికి చేరిపోయింది.

ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్, ఏఎన్నార్, శ్రీదేవి, చంద్రబాబు, హరికృష్ణ పాత్రలకు సంబంధించిన లుక్స్ ను ఆల్రెడీ విడుదల చేశారు. మిగిలిన ఒకే ఒక్క బసవతారం లుక్ ను మంచి రోజు చూసి విడుదల చేద్దామనుకుంటే ఇలా అయిపోయింది. 

సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన పాత్రలు ఇంకేం మిగల్లేదు. కేవలం ఎన్టీఆర్ గెటప్పులు మాత్రమే మిగిలాయి. వాటిలో కూడా కొన్ని గెటప్పులు బయటకు వచ్చేశాయి. మిగతావి అప్పుడప్పుడు రిలీజ్ చేసుకోవడమే. బసవతారకం లుక్ కూడా బయటకు వచ్చేయడంతో.. ఎన్టీఆర్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్స్ విడుదల చేసే కార్యక్రమం దాదాపు ముగిసినట్టే.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి