cloudfront

Advertisement


Home > Movies - Movie News

విద్యాబాలన్.. హాట్ టాక్.. ఆపట్లేదు!

విద్యాబాలన్.. హాట్ టాక్.. ఆపట్లేదు!

ఇటీవలే మహిళల విషయంలో హాట్ స్టేట్ మెంట్ ఇచ్చింది విద్యాబాలన్. నలభైయేళ్ల వయసు తర్వాత మహిళలు హాట్ గా, నాటీగా మారతారు అని విద్య చెప్పుకొచ్చింది. తను కూడా ఆ వయసుకు రీచ్ అయిన నేపథ్యంలో విద్య.. మహిళల గురించి మరింత బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. నలభై తర్వాత మహిళలు శృంగారాన్ని కూడా బాగా ఆస్వాధిస్తారని చెప్పుకొచ్చింది!

ఇలా మాట్లాడుతున్న విద్య.. మరోసారి ఒకింత హాట్ గా స్పందించింది. ఈసారి ఆమె వార్డ్ రోబ్ లో ఏముంటాయి? అనే ప్రశ్నకు ఊరించే సమాధాన్ని ఇచ్చింది విద్యాబాలన్. ‘మీ వార్డ్ రోబ్ కలెక్షన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు చాలామంది హీరోయిన్లు సమాధానాలు చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి వాళ్లకు ఇష్టమైన డ్రస్సులు, శారీల గురించి చెప్పుకొంటూ వస్తుంటారు.

హీరోయిన్ల ఇంటర్వ్యూల్లో ఇది చాలా రొటీన్ కొశ్చన్. ఈ రొటీన్ కొశ్చన్ కు హాట్ ఆన్సర్ ఇచ్చింది విద్యాబాలన్. 'కంఫర్టబుల్ బ్రా...' అంటూ మొదలుపెట్టింది ఈమె. ‘అన్ని వేళలా.... పర్ఫెక్ట్ బ్రా... అది చాలా ఇంపార్ట్ంట్’ అని చెప్పుకొచ్చింది. ఇలా లోదుస్తుల ప్రస్తావన తీసుకొచ్చి తను ఎంత హాటో, ఎంత నాటీనో చాటుకుంది విద్యాబాలన్.

‘బ్రా’ను ఇలా స్ట్రెస్ చేసిన ఈ నటీమణి.. దానితోపాటు జీన్స్ ప్యాంట్స్, లవ్లీ కాటన్ శారీస్ ఉంటాయని చెప్పింది. మొత్తానికి నలభైయేళ్ల వయసులో మహిళలు హాట్ గా మారతారని చెప్పిన విద్య.. తన స్టేట్ మెంట్ కు న్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుంది!

పచ్చ కోటలు బీటలు వారుతున్నాయా..?!