cloudfront

Advertisement


Home > Movies - Movie News

టాక్సీవాలా బ్లాక్ బస్టర్ అవ్వదు - దేవరకొండ

టాక్సీవాలా బ్లాక్ బస్టర్ అవ్వదు - దేవరకొండ

టాక్సీవాలా సినిమా ఇప్పటికే లీక్ అయింది. హెడ్ డీ పైరసీ ప్రింట్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అయినప్పటికీ సినిమాను థియేటర్లలో చూడండంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సేమ్ టైం, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వదని చెబుతున్నాడు.

"గీతగోవిందం సినిమాలా టాక్సీవాలా వందకోట్లు సంపాదించే సినిమా కాదు. పెట్టిన పెట్టుబడికి 3-4 రెట్లు ఎక్కువ సంపాదించే సినిమా. బడ్జెట్ కోటి రూపాయలైతే ఓ 10 కోట్లు రాబట్టే సినిమా. అంతేతప్ప, గీతగోవిందం రేంజ్ సినిమా కాదు. నా హీరోయిన్ ప్రియాంక మాత్రం టాక్సీవాలా నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంటోంది. ఆమె అమాయకత్వం నిజమౌతుందో, నా అనుభవం నిజమౌతుందో చూడాలి."

ఇలా టాక్సీవాలా రిజల్ట్ పై రిలీజ్ ముందే రియాక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత థియేటర్లకు తనకు లాంగ్ గ్యాప్ వస్తుందని, దాదాపు 6 నెలల పాటు తన సినిమా థియేటర్లలోకి రాదంటున్నాడు దేవరకొండ. ఇకపై పెద్ద దర్శకులతోనే సినిమాలు చేస్తానంటున్న దేవరకొండ, ఆ డీటెయిల్స్ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు.

"వచ్చే ఏడాది నుంచి పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తాను. ఇన్నాళ్లూ దొరికిన వాళ్లతో చేశాను. వచ్చే ఏడాది మాత్రం పెద్ద డైరక్టర్లే. కొరటాలతో సినిమా అంటున్నారు చాలామంది. ఇప్పటివరకు అలాంటిదేం లేదు. కొరటాల సర్ ను కలిశాను నేను. సినిమా ఎప్పుడొస్తుందో ఏంటో. కొరటాల సర్ ఫుల్ బిజీ."

పూరి జగన్నాధ్ సినిమాపై కూడా దాదాపు ఇలానే రెస్పాండ్ అయ్యాడు. "పూరి జగన్నాధ్ తో కూడా చర్చలు జరిగాయి. కానీ అప్పుడే చెప్పను. టైం తీసుకుంటాను. ఇప్పటికిప్పుడు ఏదో చెప్పి ప్రెషర్ తీసుకోవడం ఇష్టంలేదు."

తను ఈ స్థాయికి రావడమే గొప్ప అంటున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే హిట్స్, ఫ్లాప్స్ గురించి పట్టించుకోనని చెబుతున్నాడు. రీసెంట్ గా తన తల్లికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏకంగా సినిమాలు ఆపేద్దాం అనుకున్నానని, సినిమాలంటే తనకు అంత లైట్ అని ప్రకటించాడు. 

విజయ్ దేవరకొండ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్