cloudfront

Advertisement


Home > Movies - Movie News

విజయ్.. పొలిటికల్ ఎంట్రీకి సై?!

 విజయ్.. పొలిటికల్ ఎంట్రీకి సై?!

విజయ్ సినిమాలు రాజకీయ దుమారం రేపడం కొత్త ఏమీ కాదు. ఆ మధ్య మెర్సల్ సినిమా వచ్చినప్పుడు ఈ హీరోపై బీజేపీ వాళ్లు విరుచుకుపడ్డారు. విజయ్ మీద ఒక రేంజ్ లో బీజేపీ వర్గాలు ఫైర్ అయ్యాయి. ఆ సినిమాలు కేంద్రంలోని బీజేపీ విధానాలను విమర్శించే సన్నివేశాలు,డైలాగులు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమైంది బీజేపీ వర్గాల నుంచి. బీజేపీ నేతల మాటలే విజయ్ సినిమాకు కావాల్సినంత ప్రచారం తెచ్చి పెట్టాయి. యావరేజ్ అనిపించుకున్న ఆ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చేలా చేశారు బీజేపీ నేతలు.

ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకుంది అన్నాడీఎంకే. ఈ హీరో తాజా సినిమా సర్కార్ పై అన్నాడీఎంకే వీధి పోరాటికి దిగింది. ఈ సినిమాలో అన్నాడీఎంకేను కించపరిచే సన్నివేశాలున్నాయని ఆ పార్టీ వర్కర్లు మండి పడుతున్నారు. ఈ సినిమా నిర్మాతలు కూడా సన్ నెట్ వర్క్ వాళ్లు కావడంతో అన్నాడీఎంకేకు మరింత మాసాలా దొరికింది. కావాలనే జయలలితను, అన్నాడీఎంకేను కించపరిచే సన్నివేశాలు ఈ సినిమాలో పెట్టారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ప్రదర్శితం అవుతున్న పలు థియేటర్ల వద్ద విజయ్ కటౌట్లను ధ్వంసం చేశారు అన్నాడీఎంకే కార్యకర్తలు.

మధురైలో ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎలాగూ అధికారం అన్నాడీఎంకే చేతిలోనే ఉంది కాబట్టి..ఇలాంటి చేష్టలకు అడ్డు ఉండకపోవచ్చు.

ఇక ఈ సినిమా ప్రీ  రిలీజ్ ఫంక్షన్లో విజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన నటుడు ప్రసన్న తమిళనాడుకు విజయ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు.. అనే ప్రశ్నను వేశాడు. దానికి స్పందించాలని విజయ్ ను కోరాడు. అక్కడే విజయ్ పూర్తిగా బయటపడిపోయాడు. ‘నేనే ముఖ్యమంత్రిని అయితే ముఖ్యమంత్రిగా నటించను..’ అంటూ విజయ్ వ్యాఖ్యానించడు. 

తను కేవలం యాక్టింగ్ సీఎంగా ఉండను అంటూ విజయ్ పరోక్షంగా ప్రస్తుత తమిళనాడు సీఎం ఈపీఎస్ మీద సెటైర్ వేశాడని విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత నేపథ్యంలో విజయ్ కు కూడా పాలిటిక్స్ లోకి ఎంటరయ్యే లెక్కలున్నాయని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.