cloudfront

Advertisement


Home > Movies - Movie News

'రాక్షసుడు' కామెంట్స్.. వినాయక్ హర్ట్ అయ్యాడు!

'రాక్షసుడు' కామెంట్స్.. వినాయక్ హర్ట్ అయ్యాడు!

''రాక్షసుడు సినిమాతోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయ్యాడు..'' అంటూ బెల్లంకొండ సురేష్ చేసిన ప్రకటన, ఇదే తనకు తొలి సినిమా అన్నట్టుగా సాయి శ్రీనివాస్ కూడా ప్రకటించడం పట్ల  హర్ట్ అయినట్టుగా ఉన్నాడు దర్శకుడు వీవీ వినాయక్. అదెందుకో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. బెల్లంకొండ సురేష్ తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ మొదటి సినిమాను రూపొందించింది ఈ దర్శకుడే. 'అల్లుడుశీను' పేరుతో ఆ సినిమా రూపొందింది. 

పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఆ సినిమా విషయంలో వినాయక్ తన వంతు ప్రయత్నం తను చేశాడు. సినిమా కూడా సో..సో.. అనిపించుకుంది. బెల్లకొండ సురేష్ తనయుడు ఆ సినిమా దగ్గర నుంచి తన దండయాత్రలు కొనసాగిస్తూ ఉన్నాడు.

అయితే ఇప్పుడు ఇది వరకూ చేసిన దండయాత్రలను వాళ్లే గుర్తించరట. బెల్లంకొండ హీరోగా 'అల్లుడుశీను' తో పాటు వీర మాస్ డైరెక్టర్ బోయపాటితో కూడా ఒక కళాఖండాన్ని రూపొందింది. అయితే ఆ సినిమాలన్నీ సినిమాలే కాదని వారే ఇప్పుడు చెప్పుకుంటున్నారు. 'రాక్షసుడే' తొలి సినిమా అంటున్నారు.

ఈ విషయంలో మిగతా దర్శకులు స్పందించలేదు కానీ వినాయక్ స్పందించాడు. 'అల్లుడుశీను' కోసం చేయాల్సిందంతా చేశామని, ఇప్పుడు ఇలా మాట్లాడటం బాగోలేదన్నట్టుగా వినాయక్ రియాక్ట్ అయ్యాడు. మరి వినాయక్ కామెంట్లపై బెల్లకొండ తండ్రీతనయులు ఏమని స్పందిస్తారో!

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక