Advertisement

Advertisement


Home > Movies - Movie News

విశాఖలోనే జంట కట్టి.. ఆపై పాట కట్టి...!

విశాఖలోనే జంట కట్టి.. ఆపై పాట కట్టి...!

ఎస్పీబీ..ఈ మూడు అక్షరాలు తెలుగు సినిమా పాటకు తారక మంత్రాలు. శ్రీపతి పండితారాధ్యుల కుటుంబంలో జన్మించిన బాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించారు. బాలు చిన్న వయసులోనే గాయకుడు అయ్యారు. ఆ లేత వయసులోనే ప్రేమ మొగ్గ తొడిగి ఓ ఇంటివాడు అయ్యారు.

బాలు ప్రేమ వివాహానికి వేదిక విశాఖ కావడం విశేషం. విశాఖలోని సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సమక్షంలో బాలు సావిత్రిని తన సతీమణి చేసుకున్నారు. నాడు కొందరు మిత్రుల సహాయంలో వీరిద్దరూ ఒక్కటి అయ్యారు. పెద్దలు అంగీకరించకపోవడంతో బాలు తెగించి ఇలా తన ప్రేమను విశాఖ సాగరతీరాన నెగ్గించుకున్నారు.

అంతేనా విశాఖలో ఎన్నో కార్యక్రమాలు బాలూ నిర్వహించి తన ఉనికిని చాటుకున్నారు. విశాఖ ఉక్కు మీద పాట పాడినా, ఇతర దేవతామూర్తుల మీద రాగాలాపన చేసినా ఆయనకు విశాఖతో ఉన్న అనుబంధంతోనే ఇదంతా జరిగింది.

ఆయన సొంత సినిమా శుభ సంకల్పం విశాఖలోనే ఎక్కువ భాగం షూటింగ్ చేసుకుంది. ఇక విశాఖ సాగర తీరం అంటే బాలుకు ఇష్టం. అక్కడ ఆయన ఎన్నో  సాయంత్రాలు గడిపిన  మధురమైన  గురుతులు ఉన్నాయి. మొత్తానికి విశాఖకు బాలూ ఒక తీపి జ్ఞాపకం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?