cloudfront

Advertisement


Home > Movies - Movie News

118లో ఎన్టీఆర్ ను ఊహించుకున్నాను, కానీ..!

118లో ఎన్టీఆర్ ను ఊహించుకున్నాను, కానీ..!

కల్యాణ్ రామ్ హీరోగా 118 సినిమా తెరకెక్కింది. మార్చి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తే ఎలా ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ ఊహ ఎవరికీ వచ్చి ఉండదు. కానీ కథ తెలిసిన వ్యక్తి కాబట్టి కల్యాణ్ రామ్ కు ఈ ఐడియా వచ్చింది. అవును.. ఎన్టీఆర్ హీరోగా 118 చేద్దామనుకున్నాడట కల్యాణ్ రామ్.

"కథ విన్న తర్వాత నా మైండ్ లో వచ్చిన ఆలోచన ఒక్కటే. ఈ సినిమా ఎన్టీఆర్ తో చేసేద్దాం అనుకున్నాను. అంత నచ్చింది ఈ కథ. ఈ స్టోరీలైన్ ను వేరే హీరో ఎవరైనా ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు. నేను మాత్రం ఎన్టీఆర్ తో చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. అయితే ప్రొడ్యూసర్ మహేష్ స్టోరీ విన్న తర్వాత ఇది తమ బ్యానర్ లో నన్ను హీరోగా పెట్టి చేస్తామని అడిగారు. ఆల్రెడీ నాకు నచ్చడంతో ఇక కాదనలేకపోయాను."

అలా ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమాలో తను నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు కల్యాణ్ రామ్. తన సొంత బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా ఇప్పటికే ఓ సినిమా చేసిన కల్యాణ్ రామ్, తమ్ముడితో మరో సినిమా చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు వర్కవుట్ కాలేదు.

అటు తారక్ కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే ప్రస్తుతానికైతే తారక్-కల్యాణ్ రామ్ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఈ హీరో ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్టులో ఇరుక్కుపోయాడు. ఈ ఏడాదంతా ఆర్-ఆర్-ఆర్ సినిమా పనే. ఆ తర్వాతే ఎవరైనా. 

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ