cloudfront

Advertisement


Home > Movies - Movie News

సెక్స్ వేధింపులు.. హీరోయిన్ల మధ్య గొడవ!

సెక్స్ వేధింపులు.. హీరోయిన్ల మధ్య గొడవ!

సెక్స్ వేధింపుల వ్యవహారంలో బాలీవుడ్ అట్టుడుకుతోంది. మూవీ మేకర్లను, తమ సహ నటులను హీరోయిన్లు బెదరగొట్టేస్తున్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏ తరహా ఆరోపణలు వస్తాయో చెప్పడానికి లేకుండా పోయింది. ఆ సంగతలా ఉంటే.. ఈ వ్యవహారం ఇద్దరు హీరోయిన్ల మధ్యన గొడవగా మారింది. వీరిద్దరూ ఇప్పుడు పరస్పరం తిట్టుకుంటున్నారు. నీకు క్యారెక్టరే లేదన్నట్టుగా ఒకరు మాట్లాడుతుంటే, అసలు మీ నాన్న లేకపోతే నీకున్న గుర్తింపు ఎంత? అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. ఇలా పరస్పరం తిట్టుకుంటున్న నటీమణులే.. కంగనా రనౌత్, సోనమ్ కపూర్.

బాలీవుడ్ దర్శకుడు వికాస్ బెహ్ల్ మీద కంగనా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వికాస్ ఒక పర్వర్ట్ అని, ‘క్వీన్’ సినిమా షూటింగ్ సమయంలో అతడి ప్రవర్తనతో తను విసిగెత్తి పోయానని కంగనా అంటోంది. ఆ సినిమాలో నటించినప్పుడు వికాస్ తరచూ సెక్స్ ప్రస్తావన తెచ్చేవాడని, కొత్త కొత్త వాళ్లతో సెక్స్ అనుభవాలను పొందినట్టుగా చెప్పేవాడని, తనతో కూడా అనుచితంగా ప్రవర్తించేవాడని కంగనా వ్యాఖ్యానించింది. ఇది పెద్ద దుమారంగా మారింది.

ఇదివరకూ కూడా కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖుల గురించి కంగనా ఈ తరహాలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు వికాస్ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. వీరిలో సోనమ్ కపూర్ స్పందన కంగనాను ఇబ్బంది పెట్టేలా ఉంది. కంగనా మాటలను నమ్మలేం.. అని సోనమ్ వ్యాఖ్యానించింది. ఆమె ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుందని సోనమ్ అంటోంది. ఈ వ్యాఖ్యలతో కంగనాకు కోపం వచ్చేసింది.

తన మాటలు నిజాలు కావని జడ్జ్ చేయడానికి సోనమ్ ఎవరు? అని కంగనా ప్రశ్నించింది. తను గొప్ప వక్త అని, తన మాటలతో యువతను ఇన్‌స్పైర్ చేసేంత శక్తి ఉన్నదాన్ని అని.. అలాంటి తన మాటలపై మాట్లాడటానికి సోనమ్‌కు ఉన్న అర్హత ఏమిటి? అని కంగనా ప్రశ్నించింది. సోనమ్‌కు దక్కిన గుర్తింపు అంతా ఆమె తండ్రి అనిల్ కపూర్ వల్ల మాత్రమే తప్ప ఆమె ప్రతిభ ఏముంది? ఆమె మంచినటి కూడా కాదు.. అని కంగనా స్పందించింది.

మొత్తానికి లైంగిక వేధింపుల వ్యవహారం ఇలా ఇద్దరు ప్రముఖ హీరోయిన్ల మధ్య యుద్ధంగా మారడం విశేషమే.