హీరో బన్నీ నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు. అయితే సినిమాలు కాదు. వెబ్ సిరీస్ లు. ఈమేరకు ఆయన గత కొన్నాళ్లుగా సబ్జెక్ట్ లు అన్వేషిస్తూ వస్తున్నారు.
బన్నీ టీమ్ ఈ మేరకు కథలు వింటోంది. ఇప్పటికి ఈ వ్యవహారం కాస్త కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.అయితే వెబ్ సిరీస్ నిర్మాతగా లేదా సమర్పకుడిగా బన్నీ పేరు మాత్రమే వుంటుందా? సీరియస్ గా కంటెంట్ అండ్ క్వాలిటీ విషయంలో అన్నీ ఆయన చూసుకుంటారా? అన్నది తెలియాల్సి వుంది.
సినిమా నిర్మాణమైనా, వెబ్ సిరీస్ నిర్మాణమైనా బన్నీకి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే స్వంత బ్యానర్ గీతా టీమ్ వుంది. మిత్రుడు బన్నీవాస్ టీమ్ వుంది.
కానీ బన్నీ సమర్పించు లేదా బన్నీ నిర్మించు అనే ట్యాగ్ లైన్ తగిలిస్తే మాత్రం వాటికి ఓ స్టాండర్డ్ అంటూ వుండాలి. ఇప్పటికే వచ్చిన చాలా తెలుగు వెబ్ సిరీస్ ల మాదిరిగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలా వుంటే మాత్రం వృధా. బన్నీ తన వెంచర్ విషయాలు ఈ దీపావళికి వెల్లడించే అవకాశం వుంది.