వెబ్‌సిరీస్‌కు ముద్దు సీన్ తెచ్చిన తంటా…

వెబ్ సిరీస్‌లో ముద్దు సీన్ వివాదాస్ప‌దమైంది. చివ‌రికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌పై కేసు న‌మోదు చేయ‌డం వ‌ర‌కు వెళ్లింది. నెట్‌ప్లిక్స్‌లో ఎ సూటెబుల్ బాయ్ అనే సిరీస్ వ‌స్తోంది. ఇది ఆరువారాల సిరీస్‌. దీన్ని…

వెబ్ సిరీస్‌లో ముద్దు సీన్ వివాదాస్ప‌దమైంది. చివ‌రికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌పై కేసు న‌మోదు చేయ‌డం వ‌ర‌కు వెళ్లింది. నెట్‌ప్లిక్స్‌లో ఎ సూటెబుల్ బాయ్ అనే సిరీస్ వ‌స్తోంది. ఇది ఆరువారాల సిరీస్‌. దీన్ని మీరా నాయ‌ర్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో ఓ గుడిలో కిస్సింగ్ సీన్ వుంది. ఇప్పుడిదే వివాదానికి దారి తీసింది.

మ‌త‌ప‌ర‌మైన భావోద్వేగాల‌ను అవ‌మానించ‌డంతో పాటు ఇది ల‌వ్ జిహాద్‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టుగా ఉంద‌ని బీజేపీ యువ‌మోర్చా ఫిర్యాదు చేసిందిం. దీంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా ఆదేశాల మేర‌కు రేవా పోలీసులు నెట్‌ఫ్లిక్స్ కాంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్‌, డైరెక్ట‌ర్ అంబికా ఖురానాపై కేసు న‌మోదు చేశారు.

కాగా ఈ విష‌యాన్ని వివాదం చేయ‌డాన్ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రి త‌ప్పు ప‌ట్టారు. గుడిలో ముద్దు సీన్ ఉంటే త‌ప్పేంట‌ని టీఎంసీ ఎంపీ ప్ర‌శ్నించారు. బీజేవైఎం వాద‌న‌ను ఎంపీ ఖండించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌జుర‌హో ఆల‌యాలు శృంగార ప్రేమ‌ను ప్రోత్స‌హించే విధంగా ఉన్న‌ప్పుడు..  నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఉన్న కిస్సింగ్ సీన్‌తో ఇబ్బంది ఏముందని ఆమె ప్ర‌శ్నించారు.  ఈ సంద‌ర్భంగా ఖ‌జుర‌హో ఫొటోను త‌న ట్వీట్‌లో ఆమె పోస్టు చేశారు.  మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ పాల‌న‌లో దుర్మార్గం రాజ్య‌మేలుతోంద‌ని ఆమె  కామెంట్ చేశారు.  

కేసిఆర్ వ‌రాలు  బ‌ల‌మా ? బ‌ల‌హీన‌తా ?