cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఉప్పెన ఏం నేర్పింది??

ఉప్పెన ఏం నేర్పింది??

ఉప్పెన సినిమా లో నాకు అయిన experience తో ఈ వ్యాసం మొదలు పెడతాను.

సినిమాలో ఇంటర్వెల్ కి ముందు ఒక పాట ఉంటుంది. పాట వినడానికి చాలా బావుంటుంది. కానీ తీసినది "శృంగార ఉదేశ్యం తో". ఆ సమయంలో నా ప్రక్కన ఒక ఫ్యామిలీ కూర్చుంది. ఆ పాట సమయంలో తన కూతురి కళ్ళను వాళ్ళ అమ్మ మూసేస్తుంది. పాపకు 10 సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళ నాన్న పడే ఇబ్బంది, బాధ స్పష్టంగా కనిపిస్తుంది.  అది చూసిన నాకు చాలా బాధ అనిపించింది.

వాళ్ళు ఇలా సినిమాకు వచ్చి ఇంత ఇబ్బంది, బాధ పడడానికి కారణం ఎవరు?? ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులే! ఇంకా సినిమా సర్టిఫికెట్ UA అయినా 13 సంవత్సరాల లోపు పిల్లలను థియేటర్ లోనికి అనుమతించిన థియేటర్ యాజమాన్యానిది మరియు థియేటర్ చూసి చూడనట్లు వదిలేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వానిది.

నిజానికి మన తెలుగు సినిమాలలో ఆ సినిమా ఏ జోన్రా కి సంబంధించినది అని చూడము. సినిమా రావడం, ఎగేసుకుని వెళ్లిపోవడం ఆ తర్వాత ఇబ్బంది పడడం మనకు పరిపాటే. "A" సినిమాకు నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ పిల్లలను allow చేయదు. అరిచి గీ పెట్టినా పొమ్మంటుంది. సింగల్ స్క్రీన్ లలో ఆ ఆప్షన్ లేదు. మన దేశంలో ఎక్కువ ఉండేవే అవి. అదీ మన తెలుగు రాష్ట్రాలలో మరీ ఎక్కువ. వారికి టికెట్స్ తెగడమే కావాలి. ఎవరు ఎలా పోయినా వారు పట్టించుకోరు.

ఉప్పెన సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ చేత ఒక తండ్రి దగ్గర అనకూడని మాటలు అనిపించాడు దర్శకుడు. వీటికి "ప్రేమ" అని పేరు పెట్టాడు. కానీ అదంతా పైత్యం అని అర్థం చేసుకోలేకపోయాడు.

ఒక సినిమా హిట్ చేసుకోడానికి ఇంత దిగజారాలా? అనిపించింది. ఇలా సెక్స్ కోసం అనర్గళంగా మాట్లాడేసిన హీరోయిన్ వయసు కేవలం 17 సంవత్సారాలేనట. మరి ఇలా ఒక మైనర్ చేత ఇలాంటి సీన్స్ లో నటింపజేయడం చట్ట సమ్మతం ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు.

ఒక అడల్ట్ ఏమి చూడాలో ఏమి చూడకుడదో శాసించే ప్రభుత్వం పిల్లలను చూసీ చూడకుండా వదిలేయడం శోచనీయం. ఇప్పుడు బీజేపీ దయ వలన OTT లకు కూడా సెన్సార్ వస్తుంది అంట. ఈ దేశ ప్రధాని అయితే ఏకంగా మనం ఏ కుక్కలను పెంచుకోవాలో కూడా ఆయనే చెప్పేస్తారు. అడల్ట్స్ కి ఇన్ని ఆంక్షలు, కానీ పిల్లల గురుంచి పట్టించుకునే వారే లేరు. చివరికి వారి తల్లిదండ్రుల తో సహా.

అసలు ఉప్పెన UA సర్టిఫికెట్ ఎలా సాధించింది? దానికి ఇవ్వాల్సింది A సర్టిఫికెట్. అందులోనూ విపరీతమైన పైత్యం ఉంది. జగఫ్స కలిగించే డైలాగులు ఉన్నాయి. కానీ ఆ సినిమా ప్రేక్షకుల మధ్యకు వచ్చేసింది. తెలిసీ తెలియని పిల్లలు అలాంటి సినిమాలు చూడడం వలన అవి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి??

ఈ మధ్య రేప్ లు చేస్తున్న వారంతా అత్యధికులు మైనర్లే అన్న విషయం ఇక్కడ గమనార్హం. చిన్నపిల్లలకు ఇలాంటి సినిమాలు చూపించి వారిని రేప్ లు చేసేవారిగా తయారు చేస్తుంది మనమే. రేప్ చేసిన వారిని చంపేయమని గోల చేసేది మనమే. చంపేసాక చప్పట్లు కొట్టేది మనమే!

ఇలాంటి సినిమాలను వదిలి పిల్లలను పాడు చేస్తుంది ప్రభుత్వం, వాళ్ళు రేప్ లు చేసాక వారిని ఎన్కౌంటర్ పేరిట చంపేస్తుంది కూడా ప్రభుత్వమే!

కానీ నిజానికి దోషులం మనం మరియు ప్రభుత్వాలు.  కేంద్ర ప్రభుత్వం adults ఏం చూడాలి అనేది శాసించకుండా చిన్న పిల్లలు ఏం చూడకూడదు అనే విషయంలో శ్రద్ధ తీసుకుంటే అది అందరికీ మంచింది.

భాస్కర్ కిల్లి. 

ఉప్పెనంత వసూళ్లు

ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టాలి?

 


×