cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

క్వారంటైన్ లో పూజా హెగ్డే ఏం చేస్తోంది?

క్వారంటైన్ లో పూజా హెగ్డే ఏం చేస్తోంది?

మొన్నటివరకు క్షణం తీరిక లేదు. సినిమా సెట్స్ మధ్య తిరగడానికి, విమాన ప్రయాణాలకే టైమ్ సరిపోయింది. కొత్త సినిమాలకు కాల్షీట్లు కూడా ఎడ్జెస్ట్ చేయలేనంత బిజీ. అలా బిజీబిజీగా ఉండే పూజా హెగ్డే ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. కరోనా వల్ల ఆమెకు గ్యాప్ తప్పలేదు. మరి ఈ ఖాళీ సమయంలో ఆమె ఏం చేస్తోంది.?

ప్రస్తుతం స్పల్ప కరోనా లక్షణాలతో బాధపడుతోంది పూజా హెగ్డే. కరోనా తనను మరీ బాధించడం లేదని, లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, అది తన అదృష్టమని తెలిపింది. 

ఇక ఈ ఐసొలేషన్ టైమ్ లో పాజిటివ్ గా ఉండేందుకు యోగా, ధ్యానం చేస్తున్నానని, మంచి పుస్తకాలు చదువుతున్నానని తెలిపింది. ఈమధ్యే ఆమె ఓ లైవ్ మెడిటేషన్ సెషన్ లో కూడా పాల్గొంది.

ఐసొలేషన్ లో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది పూజా హెగ్డే. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిని అందరితో పంచుకుంటోంది. ఈ టైమ్ లో శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, ప్రాణాయామం లాంటివి చాలా అవసరమని.. వాటి ఆవశ్యకతను అందరికీ తెలపాలని తన ఫ్యాన్స్ ను కోరుతోంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది పూజ. ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కు రెడీ అయింది. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తయింది. ఆచార్య షూటింగ్ మధ్యలో ఉంది. త్వరలోనే తమిళ్ లో విజయ్, హిందీలో రణ్వీర్ సింగ్ చేయబోతున్న సినిమాల్లో ఆమె జాయిన్ అవ్వాల్సి ఉంది.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×