‘రమేష్’ పై రామ్ కు ఎందుకంత ప్రేమ?

ఇన్నాళ్లూ హీరో రామ్ పై ఎవరికీ ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు ఉండేవి కావు. కానీ విజయవాడ దుర్ఘటనపై చాలా దారుణంగా స్పందించిన రామ్, నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. డాక్టర్ రమేష్ బాబు హీరో రామ్…

ఇన్నాళ్లూ హీరో రామ్ పై ఎవరికీ ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు ఉండేవి కావు. కానీ విజయవాడ దుర్ఘటనపై చాలా దారుణంగా స్పందించిన రామ్, నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. డాక్టర్ రమేష్ బాబు హీరో రామ్ కి అంకులే కావొచ్చు. అయితే మరీ అంతగా ఆయన్ని వెనకేసుకు రావాలనుకోవడం మాత్రం సినిమాల్లో నీతులు చెప్పే హీరోలకి ఏమాత్రం తగదు.

10మంది ప్రాణాలు పోయాయి. వారి కుటుంబ సభ్యులకు ఎవరు సమాధానం చెబుతారు? ఏమని ఓదార్చుతారు. పోనీ అదేమైనా ఉచిత వైద్య శిబిరమా. కరోనా బూచి చూపి రోజుకి 25వేల నుంచి 60వేల వరకు బాధితుల నుంచి వసూలు చేసింది యాజమాన్యం. సుజాత అనే మహిళ దగ్గరనుంచి ఒకరోజు చికిత్స కోసం లక్ష రూపాయలతో పాటు ఆమె నాలుగు బంగారు గాజులు కూడా లాగేసుకున్నారంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా?

అగ్నిప్రమాదం ఘటనతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలే ఇప్పుడు హీరో రామ్ కి కోపం తెప్పించినట్టున్నాయి. అక్కడ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నడుపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేసేవారు అనేది రామ్ ప్రశ్న. అసలక్కడ  ప్రభుత్వం క్వారంటైన్ సెంటరే నడపలేదన్నది వాస్తవం. వాస్తవాలేవో కూడా తెలుసుకోకుండా.. ఎవరో చెప్పిన స్క్రిప్ట్ అప్పజెప్పినట్టు.. ఎవరో రాసిచ్చిన ట్వీట్ ని పోస్ట్ చేశాడు రామ్.

తప్పుచేయకపోతే రామ్ అంకుల్ డాక్టర్ రమేష్ బాబు పారిపోవడం ఎందుకు, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకోవడం ఎందుకు? వీటన్నిటిపై ప్రతిపక్షంతో సహా పచ్చపాత మీడియా మౌనం ఎందుకు? కుట్ర జరుగుతోంది వాస్తవమే కానీ.. అది రమేష్ హాస్పిటల్స్ కి వ్యతిరేకంగా కాదు. హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు కుట్ర జరుగుతోంది. అందులో రామ్ కూడా ఓ పావుగా మారాడు అంతే.

సహజంగా సినిమా జనాలు సినిమాలకే పరిమితం అవుతారు, వాళ్ల సినిమాలు, కలెక్షన్లు, రెమ్యునరేషన్లు.. ఇవే వాళ్లకు కావాల్సింది. వాళ్ల పరిథిలో ఏదైనా కామెంట్ చేస్తే వెంటనే హర్ట్ అయిపోతారు. మనోభావాలు దెబ్బతినేస్తాయి. కానీ వాళ్లు మాత్రం రాజకీయాలు, రాజకీయ నాయకులపై సడెన్ గా ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు రామ్ కూడా ఇలానే బయటకొచ్చాడు. 

బంధాలు, బంధుత్వాలు, బంధువులకి అండగా ఉండాలనుకోవడం అన్నీ సహజమే. రామ్ కూడా కావాలంటే తన రమేష్ అంకుల్ కు అండగా నిలబడొచ్చు. కానీ ఇలా కాదు.

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే

ఇదీ జగన్ విజన్