cloudfront

Advertisement


Home > Movies - Movie News

టీడీపీపై లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ప్రభావమెంత.?

టీడీపీపై లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ప్రభావమెంత.?

రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా ఈనెల 22న విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాని తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం ఖాయమన్న ప్రచారం ఓ పక్క జరుగుతోంటే, టీడీపీ అలాంటి చర్యలకు దిగితే యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసేస్తానంటూ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఏమో, వర్మ తాను అన్నంత పనీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక, వర్మ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పోల్‌ పెట్టాడు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా ప్రభావం వుంటుందా.? లేదా.? అన్నదే ఆ పోల్‌ సారాంశం. పోల్‌ పెట్టిన గంటన్నరలోనే పదివేల మందికి పైగా నెటిజన్లు ఓటేశారు. ఎంతమంది, ఎలా ఓటు వేశారు.? అన్న విషయం పక్కన పెడితే, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా గురించి ఆ స్థాయిలో జనం ఎదురుచూస్తున్నారనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోందిక్కడ.

ఇదిలావుంటే, వర్మ సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తుత ఎన్నికల సీజన్‌ని తన సినిమా ప్రమోషన్‌ కోసం ఉపయోగించేసుకుంటున్నాడు. రాజకీయంగా వెన్నుపోటుకి గురయ్యాక స్వర్గీయ ఎన్టీఆర్‌, తన అల్లుడు చంద్రబాబు మీద చేసిన విమర్శల తాలూకు ఆడియో క్లిప్పింగ్‌ని సోషల్‌ మీడియాలో విడుదల చేస్తే, క్షణాల్లో అది వైరల్‌గా మారింది.

చిత్రమేంటంటే, రామ్‌గోపాల్‌ వర్మకి, స్వర్గీయ ఎన్టీఆర్‌ అభిమానులే ఆనాటి స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆవేదన తాలూకు వీడియోలు, ఫొటోలు, పేపర్‌ క్లిప్పింగ్స్‌ పంపిస్తున్నారు. మరోపక్క, స్వర్గీయ ఎన్టీఆర్‌ స్వయంగా చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తేనే జనం పట్టించుకోలేదనీ, వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాతో ఏం చేయగలడంటూ ఎగతాళి చేసే టీడీపీ నేతలూ లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..