సంక్రాంతి నాటికి తెలుగు రాష్ట్రాలలో సినీ ప్రియులు థియేటర్లకు వస్తారని తెలుగు సినిమా నిర్మాతలు నమ్మకంతో వున్నారు. అందుకే సంక్రాంతికి పలు సినిమాల విడుదలను ప్లాన్ చేస్తున్నారు.
అయితే సంక్రాంతికి వస్తుందని బలంగా నమ్ముతోన్న వకీల్ సాబ్ చిత్రానికి మాత్రం దిల్ రాజు ఇంకా డేట్ ప్రకటించలేదు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా తిరిగి వచ్చేసినప్పటికీ దిల్ రాజు ప్రస్తుతం సంకట స్థితిలో వున్నాడు.
ఎందుకంటే రిస్క్ చేసి విడుదల చేయడానికి ఇది పాతిక కోట్ల సినిమా కాదు. కనీసం వంద కోట్ల బిజినెస్ జరిగితే తప్ప దిల్ రాజుకు వర్కవుట్ అవదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో బయ్యర్లు అంత పెద్ద మొత్తం రిస్క్ చేస్తారా అనేది అనుమానమే.
ఇంత పెద్ద చిత్రానికి ఓటిటి సంస్థలు కూడా పెద్ద మొత్తం ఇచ్చే వీల్లేదు. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై దిల్ రాజుకే క్లారిటీ లేదు.
ముందయితే ప్రోడక్ట్ రెడీ చేసుకుని పెట్టుకుంటే తర్వాత రిలీజ్ సంగతి తీరికగా ప్లాన్ చేసుకోవచ్చునని వకీల్ సాబ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. పవన్‌కళ్యాణ్ కూడా ఈ చిత్రాన్ని త్వరగా ఫినిష్ చేసుకుని మిగతా కమిట్‌మెంట్స్ చూడాలనుకుంటున్నాడు.