cloudfront

Advertisement


Home > Movies - Movie News

కల్యాణ్ రామ్ అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా?

కల్యాణ్ రామ్ అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా?

ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న టైమ్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను ఆదుకున్నాడు ఎన్టీఆర్. జై లవకుశ సినిమాతో కల్యాణ్ రామ్ ను ఒడ్డునపడేశాడు. ఆ సినిమా టైమ్ నుంచి అన్నదమ్ముల మధ్య అనుబంధం ఇంకాస్త పెరిగిందనే విషయాన్ని అంతా గమనించారు. ఇప్పుడు అదే చనువుతో తారక్ తో మరో సినిమా చేస్తానంటున్నాడు కల్యాణ్ రామ్.

"తారక్ తో ఓ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ సాధినేని దర్శకత్వంలో నేను హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది. అన్నీ సెట్ అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తారక్ హీరోగా 2019లో సినిమా ఉండొచ్చు."

ఇలా తన బ్యానర్ పై తమ్ముడు తారక్ తో సినిమా ఉంటుందని కల్యాణ్ రామ్ స్పష్టం చేశాడు. అయితే కల్యాణ్ రామ్ చెప్పినంత ఈజీగా ప్రాజెక్టు సెట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే మరో రెండేళ్ల వరకు ఎన్టీఆర్ ఫుల్ బిజీ.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి కనీసం రెండేళ్లు పడుతుంది.

అప్పటివరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ మరో సినిమా చేయడం దాదాపు అసాధ్యం. కల్యాణ్ రామ్ మాత్రం వచ్చే ఏడాదే సినిమా ఉంటుందని బుకాయిస్తున్నాడు. మరి కల్యాణ్ రామ్ అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకుంటాడేమో చూడాలి.