Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో అనిపించుకోవాలంటే పవన్ ఆ పని చేయాలి

హీరో అనిపించుకోవాలంటే పవన్ ఆ పని చేయాలి

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. పవన్ కల్యాణ్ గురించి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే మాటలివి. కంటెంట్ ఉన్నోడికి థియేటర్లే అక్కర్లేదు ఓటీటీ ఉన్నా కూడా చాలు. ఇటీవల చాలామంది ఓటీటీ స్టార్లు నిరూపించిన వాస్తవం ఇది. మరి పవన్ కల్యాణ్ కి నిజంగా ఆ కంటెంట్ ఉందా, థియేటర్లను కాదని ఓటీటీలో సినిమా విడుదల చేసే దమ్ము ఉందా..?

"కేవలం నన్ను టార్గెట్ చేయడానికే సినిమా టికెట్లు ఆన్ లైన్లో అమ్ముతున్నారు, రేట్లు తగ్గించారు.." ఇదీ గతంలో పవన్ కల్యాణ్ తనని తాను అతిగా ఊహించి చేసుకున్న స్వోత్కర్ష. తిక్కరేగితే అభిమానులకు సినిమా ఫ్రీగా చూపించేస్తానని కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. 

విశాఖ ఉక్కు దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్లి.. అక్కడ తన సినిమా డైలాగులు గొట్టారు. ప్రభుత్వం తనను తొక్కేయాలని చూస్తోందని, తన సినిమాలని అడ్డుకోవాలనుకుంటోందని, తన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తోందని, పంతానికి దిగితే ఏపీలో తన సినిమాలు ఉచితంగా థియేటర్లలో ప్రదర్శిస్తానని ఆవేశంగా మాట్లాడారు.

ఫ్రీగా చూపించొద్దు మహా ప్రభో.. ఓటీటీకి ఇస్తే చాలు అంటున్నారు నెటిజన్లు. మరి నిజంగానే పవన్ కి ఆ దమ్ముందా.. ఉంటే లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ తో తనలో ఆ ధైర్యం ఉందని రుజువు చేసుకోవచ్చు కదా..?

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో, ఆ తర్వాత పవన్ చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు చూస్తే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటారని అనుకున్నారంతా. కానీ అంతలోనే తుస్సుమన్నారు, అందరూ టికెట్ రేట్ల గురించి మాట్లాడేటప్పుడు తాను మాత్రం సైలెంట్ అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ ఫస్ట్ కాపీతో సిద్ధమౌతుంది. థియేటర్లలోనే విడుదల చేస్తామంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఓసారి వాయిదావేశారు, ఇప్పుడు మరోసారి విడుదల వాయిదా అంటున్నారు.

నిజంగానే పవన్ కి అంత ధైర్యం ఉంటే.. థియేటర్ల కోసమే సినిమాని దాచుకోవడం ఎందుకు, టికెట్ రేట్లపై నానా యాగీ చేసిన పవన్ కల్యాణ్.. తన సినిమాను ఉచితంగా థియేటర్లలో వదిలేయొచ్చు కదా. పోనీ నిర్మాతలకు నష్టం అనుకుంటే.. తన సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేయొచ్చు కదా. ఇలా చేస్తే ఏపీ ప్రభుత్వంపై ఆయన తన నిరసన తెలియజేసినట్టు అవుతుంది. ఓటీటీలోకి పెద్ద సినిమాలు కూడా రావొచ్చనే మంచి సంకేతాల్ని టాలీవుడ్ కు ఇచ్చినట్టు అవుతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?